అడవి రంగాపూర్ భూముల స్వాధీనం ఎప్పుడు….?

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొండని ములుగు కలెక్టర్ ఆదేశించిన అధికారుల్లో చలనం లేదు
వెంకటాపురం మండలం అడవి రంగాపురం సర్వే నెంబర్ 28లోని 34 ఎకరాల్లో అక్రమార్కుల తిష్ట
ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కనీస చలనం లేని రెవెన్యూ అధికారులు
కబ్జా పై కలెక్టర్ సీరియస్ అయిన ఇప్పటికి భూమిని స్వాధీనం చేసుకొని అధికారులు
విచారణతోనే సరిపెట్టారు స్వాధీనం చేసుకోవడం మరిచారు.
ప్రభుత్వ భూమిని హస్తగతం చేసుకోవడానికి పైరవీలు మొదలు పెట్టిన కొందరు అక్రమార్కులు

34 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాయంగా అక్రమార్కులు ఆక్రమించుకొని ఈ భూమి మాదే అంటున్న రెవెన్యూ అధికారులు మాత్రం కదలడం లేదు. విచారణ, సర్వే అంటూ కాలయాపన చేస్తూ ఆక్రమణ దారులు భూమిని తమ కబ్జా లోనే ఉంచుకునేటట్లు చేస్తున్నారు తప్ప, భూమి సర్కారుదేనని తెలిసిన అటువైపు కన్నెత్తి చూసేంత తీరిక కూడా వారికి చిక్కడం లేదట … ప్రభుత్వ భూమి స్వాధీనం ఎక్కడి వరకు వచ్చింది సార్ అని స్థానిక తహశీల్దారును ప్రశ్నిస్తే తాను కొత్తగా వచ్చిన, పనులు బాగా ఉన్నాయి తీరిగ్గా విచారణ చేసి, పరిశీలించి చెబుతానని సమాధానం ఇస్తారు.

అడవి రంగాపూర్ భూముల స్వాధీనం ఎప్పుడు....?- news10.app

వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా వెంకటాపురం మండలం అడవి రంగాపురం గ్రామంలో 28 సర్వే నంబర్ లో అంత ప్రభుత్వ భూమి ఉంది. ఏ అధికారి సహకరించాడో… ఎవరు పథకం వేశారో తెలియదు కాని పదుల సంఖ్యలో ఎకరాల భూమి ఉన్న కొంతమంది రాజకీయ పలుకుబడితో ఈ సర్వే నంబర్ లోని 34 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేసే ప్రయత్నం చేశారు…. అధికారుల సహకారం, రాజకీయ అండతో కొంతమంది ప్రభుత్వ భూమి తమదేనంటూ పట్టాలు కూడా పొందారు… గ్రామంలో అనేకమంది దళితులు ఇతరులు గజం జాగా కూడలేకుండా బాధలు పడుతుంటే వీరుమాత్రం ఒక్కొక్కరి పేరుపై 3 నుంచి 4 ఎకరాల ప్రభుత్వ భూమిని దొడ్డి దారిన అక్రమంగా పట్టా చేసుకున్నారు. ఈ విషయాన్ని కొద్దీ నెలల క్రితం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని న్యూస్10 కథనం ప్రచురించింది. అప్పుడు కళ్ళు తెరిచిన రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటామని భూమి కబ్జా చేసినవారికి నోటీసులు అందజేసి విచారణకు రావాలని ఆదేశించారు… విచారణలో ప్రభుత్వ భూమేనని తేల్చారు… రెండు, మూడు రోజులు విచారణ, సర్వే అంటూ హడావుడి చేసారు… ప్రభుత్వ భూమిని అక్రమ కబ్జా దారులనుంచి స్వాధీనం చేసుకుంటారని గ్రామస్తులంతా భావించారు… కానీ ఎంజరిగిందో ఏమో తెలియదు కాని మళ్ళీ ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు ఆటకెక్కించారు… రెండు రోజులు హడావుడి చేసి మళ్ళీ ఈ విషయాన్ని మరిచిపోయి చేస్తాం, చూస్తాం అంటూ సమాధానం ఇస్తున్నారు… కబ్జా చేసినవారు మాత్రం భూమి తమదేనని తమను ఎవరు ఎం చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్న అధికారులు మాత్రం భూమి స్వాదినానికి వెనకాడుతున్నారు.

కలెక్టర్ చెప్పిన….

వెంకటాపురం మండలం అడవీరంగాపూర్ గ్రామంలోని 28 సర్వే నంబర్ లో కబ్జాకు గురైన 34 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకోవాలని స్వయంగా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చిన అధికారులు మాత్రం చర్యలకు వెనకాదుతున్నారు. భూమిని స్వాధీనం చేసుకుంటాం… విచారణ చేస్తున్నాం అంటూ కలెక్టర్ కు చెపుతున్న రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో మాత్రం అలా వ్యవహరించడం లేదని గ్రామస్తులు అంటున్నారు. కొంతమంది అధికారులు కబ్జా దారులతో కుమ్మకై విషయాన్ని నాన్చుతున్నారని వారు ఆరోపించారు. ఇంకొందరు భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా పైరవీలు సైతం మొదలు పెట్టారని వారు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని భూములను స్వాధీనం చేసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. కలెక్టర్ మారో సారి ఈ విషయంలో దృష్టి సారించి ప్రభుత్వ భూములు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునేలా చేయాలని కోరారు.

కొత్తగా వచ్చిన సర్వే నంబర్ 28 లో ప్రభుత్వ భూముల కబ్జా, స్వాధీనం విషయంలో న్యూస్10 వెంకటాపూర్ తహశీల్దార్ తపజుల్ హుస్సేన్ ను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని, చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని. పెండింగ్ పనుల పూర్తి తర్వాత వివరాలు తెలుసుకొని విచారణ జరుపుతానని చెప్పారు.