‘కుడా’ దృష్టి లోపించింది…?

అధికారులు కార్యాలయానికే పరిమితం
మాటలు,ముచ్చట్లు అనుమతులకే పరిమితం
క్షేత్ర స్థాయిలో తిరిగేది లేదు పరిశీలన అంతకు లేదు
నగరం తో పాటు శివారు ప్రాంతాలలో అడ్డగోలుగా వెంచర్లు
కూడా నిభందనలకు తూట్లు అతి తక్కువ స్థలాల్లో వెంచర్లు

కూడా అధికారులు ప్రస్తుతం అధికారిక కార్యకలాపాలపై దృష్టి కాస్త మందగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూడా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సైతం సాగదిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు కేవలం అనుమతులు ఇవ్వడానికే పరిమితమయిపోయి క్షేత్ర స్థాయిలో పర్యటించి విషయాలు తెలుసుకోవడంలో విఫలం అవుతున్నారని పలువురు అంటున్నారు.

'కుడా' దృష్టి లోపించింది...?- news10.app

గ్రేటర్ వరంగల్ నగరం తో పాటు మిగతా కొన్ని నగర శివారుకు దూరంగా ఉన్న గ్రామాలు సైతం కూడా పరిధిలో కొనసాగుతున్నాయి.నగరం విస్తరిస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొద్దీ కొద్దిగా పుంజుకుంటుంది. భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సామాన్యులేవరు నగరంలో భూములు కొనేందుకు సాహసం చేయడంలేదు. దింతో నగరానికి దూరంగా ఓ ఐదు, పది కిలోమీటర్ల దూరంలో ఖాళీ స్థలాలు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఐయితే ఇవి కూడా పరిధిలో ఉండగా కూడా అనుమతులు ఇస్తేనే సామాన్యునికి న్యాయం జరుగుతుంది. కూడా లే ఔట్ భూమి పేరుతో రియల్ వ్యాపారులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి కూడా అధికారులు అనుమతులను గుడ్డిగా జారీ చేస్తూన్నారని ఆరోపణలు వస్తున్నాయి. కూడా నిబంధన లు పాటించని వారుకుడా అనుమతులు పొంది సామాన్యులను మోసం చేస్తున్నారని తెలుస్తోంది.

అడ్డగోలు వెంచర్లు..?

నగరం తో పాటు నగర శివార్లలో అడ్డగోలుగా వెంచర్లు పుట్ట గొడుగుళ్ల పుట్టుకు వస్తున్నట్లు తెలిసింది. కూడా నిబంధనలు పాటించకుండా, లే ఔట్ లేకుండా కొందరు వెంచర్లు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.ఇలాంటి వాటిపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఫిర్యాదులు వచ్చిన అటువైపు వెళ్లేందుకు కూడా తీరిక లేనంతగా అధికారులు కార్యాలయానికే పరిమితం అవుతున్నట్లు తెలిసింది.నగర శివారులో కేవలం 20 గుంటలు, 30 గుంటల్లో వెంచర్లు వేస్తూ తమవద్ద ప్లాట్ లు కొనండని వెంచర్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీలుకోవడానికి కూడా అధికారులు వెనుకాడుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం మూలంగా సామాన్య ప్రజలు కూడా అనుమతులు లేని ప్లాట్ లు కొని నష్ట పోతున్న కూడా అధికారులు మాత్రం అటువైపుగా దృష్టి పెట్టడం లేదు. దింతో ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. వెంచర్ వేసే రియల్ వ్యాపారులు చెప్పినట్లే కూడా అధికారులు వింటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.