లేబర్ అధికారి ఘరానా మోసం అవినీతి ” రాజ్”

ఉద్యోగాల పేరుతో భారీ మోసం
65 లక్షల రూపాయల వరకు అక్రమంగా వసూలు
బురిడీ కొట్టించటంలో ఆరితేరిన లేబర్ అధికారి..
ఉద్యోగానికి ఎసరస్తుందని తమ్ముడి ఖాతాలో డబ్బులు జమ
ఉద్యోగాలు రావు…. డబ్బులు తిరిగి ఇవ్వడు
డబ్బులు ఇవ్వమని అడిగితే అట్రాసిటి కేసు పెడతానని బెదిరింపులు
న్యూస్-10 ను ఆశ్రయించిన భాదితులు

లేబర్ అధికారి ఘరానా మోసం అవినీతి " రాజ్"- news10.app

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ లేబర్ అధికారి. ఉద్యోగాలిపిస్తానని చెప్పి నిరుద్యోగులను బురిడీ కొట్టించి కావాల్సిన కాడికి దండుకొని నిండా ముంచాడు. ఉద్యోగాల పేరుతో వల వేసి నిరుద్యోగుల వద్దనుంచి భారీగానే దండుకున్నాడు. తియ్యని మాటలు చెప్పి రేపో మాపో ఉద్యోగం వస్తుందని నమ్మకంగా పలికి… ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే తన అసలు రూపం బయట పెట్టాడు. డబ్బులు అడిగితే అట్రాసిటీ కేసు పెడతానని బాధితులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఉద్యోగం వద్దు ఏది వద్దు తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని కోరిన, కాళ్ళ వేళ్ళా పడిన ఆ లేబర్ అధికారి మనసు కరగలేదట.

లేబర్ అధికారి ఘరానా మోసం అవినీతి " రాజ్"- news10.app

అసిస్టెంట్ లేబర్ అధికారి చేతిలో మోసపోయిన బాధితుల అందించిన వివరాల ప్రకారం. హన్మకొండలోని లేబర్ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అంబాల ప్రసాద్ రాజ్ ఉద్యోగాలు ఇప్పిస్తానాని వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన కంభంపాటి అనిల్ కుమార్ తో నమ్మబలుకుతాడు. అసలే లేబర్ అధికారి ఓ హోదాలో ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే అధికారి మాటలను నమ్మేశాడు. తనతో పాటు తన మిత్రులకు కూడా ఈ విషయాన్నీ చేరవేశాడు. కార్మిక శాఖ, రెవెన్యూశాఖ, సహకార శాఖ లో గ్రేడ్-2 స్థాయి ఉద్యోగాలు ఉన్నాయని లేబర్ అధికారి చెప్పాడని డబ్బులు చెల్లిస్తే పని చేసిపెడతానని అన్నాడని ఆశలు పెట్టుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే లేబర్ అధికారి అడిగిన మొత్తం సమర్పించుకోవాలి కనుక తన మిత్రులు అశోక్, రసూల్, సీతారాం, పెనుమాక శివ, ఓబుల్ రెడ్డి, కలువల రాజకుమార్, చెలుకల రమాకాంత్, కిషోర్ ల నుంచి తన ద్వారా 65 లక్షల రూపాయలు లేబర్ అధికారికి ముట్టజెప్పారు. ఐయితే ఈ డబ్బుల మొత్తం అధికారి బ్యాంకు అకౌంట్ లో వేస్తే ఉద్యోగానికి ఎసరు వస్తుందని భావించి తన తమ్ముడు అంబాల కరుణాకర్ ఖాతాలో సదరు అధికారి బాధితుల చేత డబ్బులు జమ చేయించుకున్నాడు.

పది సంవత్సరాలు గడిచాయి

ఉద్యోగాలు ఇప్పిస్తామని లేబర్ అధికారి బాధితులనుంచి డబ్బులు తీసుకొని పది సంవత్సరాలు గడిచాయి. ఉద్యోగాలు మాత్రం రాలేదు. రేపు మాపు అంటూ కాలం వెళ్లబుచ్చిన అధికారి చుట్టూ బాధితులు చెప్పు లరిగెల తిరిగారు ఐయిన లాభం లేకుండా పోయింది. ఉద్యోగాలు ఎలాగు రావని అనుకున్న బాధితులు తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని లేబర్ అధికారిని కోరారు. అసలు కథ ఇక్కడ మొదలయింది. డబ్బులు అడిగితే అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు. బాధితుల తరపున ఎవరు మాట్లాడడానికి వెళ్లిన వారిని తనవైపు తిప్పుకుంటున్నాడట. దింతో విసిగిపోయిన బాధితులు ఆ అధికారిపై డిప్యూటీ కమిషనర్ కు పిర్యాదు కూడా చేశారు.

మానసిక వేదన అనుభవిస్తున్నాం

ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఆస్తులు అమ్మి,అప్పులు చేసి లేబర్ అధికారికి ఇస్తే తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వకుండా మానసిక వేదనకు గురి చేస్తున్నాడని బాధితుడు కంభంపాటి అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. లేబర్ అధికారి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నాడని అట్రాసిటీ కేసు పెడతానని అంటున్నాడని ఆయన అన్నారు. తమ డబ్బులతో విలాసవంతమైన భవనాలు, ఇతర ఆస్తులు కొని బినామీ పేర్లతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. మాయమాటలతో మా లాగే అనేకమంది నిరుద్యోగులను నిండా ముంచాడని తెలిపారు. తనకు ఎలాగైనా న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని అధికారులను వేడుకున్నాడు.

60 తో పాటు మరో 35

ఉద్యోగాలు ఇప్పిస్తానని 60 లక్షలు వసూలు చేయడమే కాకుండా మరో 35 లక్షలు వసూలు చేశాడని బాధితులు అంటున్నారు. ఉద్యాగాలకు అరవై లక్షలు ఇచ్ఛాక తాను ఇల్లు కట్టుకోవడం కోసం మరో 35 లక్షలు కావాలంటే తెలిసిన వారి దగ్గర 35 లక్షలు అప్పుగా ఇప్పించామని ఇప్పుడు మొత్తంగా 95 లక్షలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నాడని బాధితులు ఆందోళన చెందారు. మొత్తానికి లేబర్ అధికారి నిరుద్యోగుల నుంచి భారీగానే దండుకొని వారిని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు.