కూలిన పురాతన భవనం

నలుగురికి తీవ్రగాయాలు

కూలిన పురాతన భవనం- news10.app

వరంగల్ చౌరస్తాలో సోమవారం ఓ పురాతన భవనం కూలింది. చౌరస్తాలోని ప్రాంతంలో ఉన్న ఈ భవనం చాలా పురాతనమైనది గత రాత్రి నుంచి ఓ మోస్తరుగా వర్షం కురుస్తుండగా ఈ రోజు ఉదయం భవనం ఓ పక్క పూర్తిగా కూలిపోయింది. దింతో భవనం వద్ద ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.