పర్వతగిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్

వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ సోమవారం పర్వత గిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పోలీస్ కమీషనర్ అధికారులతో కల్సి పరిశీలించడంతో పాటు పోలీస్ స్టేషన్ పనితీరును పోలీస్ కమిషనర్ అధికారులను అడగితెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కను నాటారు. అంతకు ముందు తొలిసారిగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన పోలీస్ కమిషనర్ కు మామూనూర్ ఎ.సి.పి శ్యాం సుందర్, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కిషన్, సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రశాంత్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.