కేసులు పెట్టి తొక్కిస్తా…!

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుడు ఆత్మకూరు ఇంచార్జ్ సర్పంచ్ వంగాల స్వాతి భర్త భగవాన్ రెడ్డి తన భార్య పదవిని అడ్డుగా పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తూ… ఇంటి నిర్మాణం కోసం వేలల్లో వసూలు చేస్తే బాధితుడు తన గొడును వెళ్లబోసుకున్న ఆడియో ఆధారంగా వార్త రాస్తే రెడ్డి దొరకు కోపం వచ్చింది… కనీస ఇంగితం కోల్పోయి నోటికొచ్చిన బూతులు తిడుతూ న్యూస్10 ఆత్మకూరు విలేకేరిపై విరుచుకుపడ్డాడు…కేసులు పెట్టి తొక్కిస్తా…పెద్ద పెద్దోళ్లనే తొక్కిన నువ్వెంత …? అంటూ బెదిరింపులకు దిగాడు… కొ…. గా గల్లా పట్టి రోడ్ పై కొడతా పి…కుంట్ల గు…తంతా బోసిడికే నువ్వు రాసేది ఏంది రా….? అని విచక్షణ కోల్పోయి బూతులందుకున్నాడు… మర్యాద గా ఉంటేనే మంచిది ఇకనుంచి రాజకీయం వేరు అంటూ సినిమా టైప్ డైలాగులతో వార్నింగ్ ఇచ్చాడు… నువ్వే పది వేలు ఇచ్చి భాదితుని ఆడియో రికార్డ్ చేసావంటూ పనికిమాలిన ఆరోపణలు చేసాడు…దొంగే.. దొంగ దొంగ అని అరిచిన చందాన చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు భాదితుడితోనే నీపై కేసు పెట్టిస్తా అంటూ తన అధికార గర్వాన్ని ప్రదర్శించాడు…

అధికారంలో ఉన్నాం ఇక అందరూ తమ దృష్టిలో పురుగులతో సమానం…ఎం చేసిన , ఎం మాట్లాడిన చెల్లుతుంది అన్నట్లు విలేకరిని తీవ్ర స్థాయిలో బెదిరించాడు…పరకాల ఎమ్మెల్యే అండ చూసుకొని ఇతగాడు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే మాత్రం తనకేం తెలియనట్లే ఉంటున్నాడు… ఇంచార్జ్ సర్పంచ్ గా తన భార్య బాధ్యతలు చేపట్టి పట్టుమని పది రోజులు గడవకముందే వసూళ్లకు పాల్పడుతూ ఇదేంటని ప్రశ్నిస్తూ ఆధారాలతో వార్త రాస్తే జీర్ణించుకోలేక చేసిన తప్పు బయటపడిందనే కోపంతో బూతు పురాణం అందుకోవడం అతనికే చెల్లింది… పైగా విలేకరి ఎదో తప్పు చేసినట్లు…. అధికారంలో ఉన్నాం కనుక పోలీసులు తన మాటే వింటారనే అతి తెలివితో కేసులు పెట్టి తొక్కిస్తా… అంటూ బరితెగింపు మాటలతో తన వక్ర బుద్దిని చాటుకున్నాడు ఇంచార్జ్ సర్పంచ్ భర్త… మరి ఈ బూతుల గులాబీ నేత నిర్వాకాన్ని పరకాల ఎమ్మెల్యే సమర్దిస్తారో… పెదవి విప్పకుండా మౌనంగా ఉంటారో… తమ అనుచరులు ఏది చేసినా రైటే అంటూ పరోక్షంగా ప్రోత్సఇస్తారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here