రావుగారి కబ్జా కహానీ…..?

ఇదో రావు గారి కబ్జా కహానీ …అధికారుల పరిచయాలు , రాజకీయంగా పలుకుబడి ప్రశ్నించిన వారెవరినైన మ్యానేజ్ చేయగల నేర్పరితనం…రెవెన్యూ శాఖ మొదలుకొని ఉన్నతాధికారులు, రాజకీయ పరిచయాలతో ఏకంగా సర్కార్ భూమికే ఎసరు పెట్టాడు… సర్కార్ భూమి అంటే మనం అనుకున్నట్లు ఏ గుడిసో ,చిన్నపాటి ఇల్లో కట్టుకోవడానికి కావాల్సిన అరవై గజాలో ,వంద గజాలో కాదు… ఒకటి కాదు రెండు కాదు గ్రేటర్ వరంగల్ పరిధిలోని హన్మకొండ నగరం నడిబొడ్డున నాలుగు ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఎంచక్కా కబ్జా పెట్టేసాడటా… భూమి లేని నిరుపేదలుగా గుర్తించి ఓ దళిత కుటుంబానికి సర్కార్ ఆ భూమిని కేటాయిస్తే… ఆ భూమి నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఇప్పటికి అది అసైన్డ్ భూమి అంటూ ధరణిలో చూపుతున్న రావు గారు మాత్రం ఆ భూమి నాదే అని మొండికేస్తూ ఆ భూమిలో ఓ భవంతి నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ ఇప్పటికే పిల్లర్లు సైతం నిర్మించాడట…

రావుగారి కబ్జా కహానీ.....?- news10.app

“తిలా పాపం తలా పిడికెడు”అన్న చందాన కొంతమంది ప్రజాప్రతినిధులు అతగాడి వద్ద అందినకాడికి దండుకొని భూమి నీదే అంటూ అభయం ఇచ్చేసారట… ఇంటి నిర్మాణ అనుమతి కోసం గ్రేటర్ వరంగల్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధి అక్షరాల పది లకారాలు తీసుకొని పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్లు విశ్వసనీయ సమాచారం… కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి రావు గారి పరం చేయాలని చూస్తున్నది ఎవరు… సహకరిస్తుంది ఎవరు…. అసలు రావు గారి కబ్జా కహానీ ఏంటి సమగ్ర వివరాలు మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here