అతర్వాతే మనం….

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అభ్యర్థి ప్రకటనపై ఇరు పార్టీల కసరత్తు
అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించిన కమలం, గులాబీ పార్టీలు
అభ్యర్థి విషయంలో ఇరు పార్టీల దాగుడుమూతలు
ఎవరు ముందుప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్న బీజేపీ, టీఆర్ఎస్
ఒకరు ప్రకటించాక బలాబలాలు బేరీజు వేసుకుని.. అభ్యర్తిని ప్రకటించాలని రెండు పార్టీల వ్యూహం
ఇంతకు అభ్యర్తి ని ముందు ప్రకటించేదెవరు…?

అతర్వాతే మనం....- news10.app

తెలంగాణలో మరో కీలకమైన ఉప ఎన్నికకు తెరలేచింది. నోముల మృతితో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది… దింతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తన ఖాతాలో వేసుకోవడంకోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా… దుబ్బాక తరహాలో నాగార్జున సాగర్ స్థానం తమకు రాకపోతుందా…? అని బిజేపి ఆశగా ఉంది… ఇక ఇక్కడి నుంచి వరుసగా ఎమ్మెల్యే గా గెలిచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పెద్దలు జానారెడ్డి సైతం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోల్పోయిన ఎమ్మెల్యే పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు…. ఇలా నాగార్జునసాగర్ లో ప్రస్తుతం త్రిముఖ పోటీ కాస్త గట్టి గానే ఉండేట్లు కనిపిస్తోంది… ఇక నిన్న ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈ మూడు పార్టీలు మరింతగా అలెర్ట్ ఐయాయి… సామాజిక వర్గాలు, బలం, బలగం తదితర అంశాలను బేరీజు వేసుకుని ముందుకు పోతున్నాయి… ఇప్పటికే ఈ అంశాలన్నింటిని ఈ పార్టీలు సరిచూసుకున్న అభ్యర్థుల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ లు మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేదు… గులాబీ ప్రకటిస్తే కమలం… కమలం ప్రకటిస్తే గులాబీ అన్నట్లు ఒకరికొకరు ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా చూస్తున్నారట… ఫలానా అభ్యర్తిని పెడితే తాము అంతకంటే బలమైన అభ్యర్థిని నిలపాలని ఇరు పార్టీలు ఒకరికొకరు లోలోపల ఆలోచించుకొని అభ్యర్థి విషయంలో ఇంకా ఆలోచనలు చేస్తున్నారట… దింతో ఇరుపార్టీలు అభ్యర్థులను ఎవరిని ఖరారు చేస్తారా…అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారట.

క్లారిటీ లేదు…

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. కాంగ్రెస్ తరపున ఇక్కడ నుంచి మాజీమంత్రి జానారెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన కుటుంబసభ్యులకు పోటీ చేసే అవకాశాన్ని గులాబీ బాస్ ఇస్తారా ? లేదా ? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారని.. వాటి ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేస్తారని వార్తలు వినిపించాయి.ఇక టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించిన తరువాతే సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని బరిలోకి దింపడమా లేక యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని పోటీ చేయించడమా ? అనే అంశంపై బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో పది రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో.. ఈ విషయంలో ముందుగా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందా ? లేక బీజేపీ నిర్ణయం ప్రకటిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అంశం నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ప్రభావం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ ఫలితాలను బట్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు.. అందులోనూ బీజేపీ, టీఆర్ఎస్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి నాగార్జునసాగర్ సంగ్రామానికి నగారా మోగడంతో.. టీఆర్ఎస్, బీజేపీ ఏ విధంగా ముందడుగు వేస్తాయన్నది ఉత్కంఠగా మారింది.