నమ్మేరు…సుమా..?

ఎన్నికల వెనుక ఎన్నికలు
ఓట్ల వేటలో నాయకులు

లాభ నష్ట బేరీజులో పార్టీలు
పదవులకోసం ఆరాటం

సంపాదనే వారి ప్రథమ లక్ష్యం
పుట్టెడు కష్టాల్లో ఓట్లేసిన జనం

మాయ మాటలు చెప్పేందుకు సిద్ధం నాయకుల గణం

ఇంకా నమ్మేరు ఆ మోసకారుల మాటలు
ఇచ్చే హామీలన్నీ సర్వం నీటి మూటలు