కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం

వరంగల్‌ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. 2009 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్‌ హైమద్ పాషా, కమిషనరేట్‌లోనే పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. వెంటనే గుర్తించిన తోటి సిబ్బంది కానిస్టేబుల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా బదిలీ విషయంలో కానిస్టేబుల్‌ మనస్తాపం చెందినట్లు సమాచారం.. ఇటీవలే ఈ కానిస్టేబుల్ను భూపాలపల్లి కి బదిలీ చేసినట్లు తెలిసింది.

కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం- news10.app