నిబంధనలకు తూట్లు…!

ఓవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజలందరూ భయంతో వణికి పోతున్నారు… దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు… 8 దశలుగా ఇంకా కొనసాగుతున్న బెంగాల్ ఎన్నికలు… అతర్వాత మన రాష్ట్రంలో వచ్చిన ఎన్నికలు ప్రజలకు నిజంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి… మొన్నటికి మొన్న నాగార్జునసాగర్ ఎన్నికలవల్ల పోటీలో ఉన్న అబ్యర్థులు, వారితో ప్రచారంలో ఉన్న వారికి కరోన పాజిటివ్ రావడంతో నాగార్జున సాగర్ కాస్త కరోనా సాగర్ గా మారిందని విపరీత కామెంట్లు వచ్చాయి…. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ సైతం కరోనా బారిన పడ్డారు.. ఇది కేవలం ఎన్నికల ప్రచారం, వేలమంది పాల్గొన్న సమావేశాలకు హాజరు కావడం వల్లె అని అందరికి తెలుసు… ఐయిన ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో 5 మున్సిపాలిటీలకు, 2 కార్పొరేషన్ లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది… కోవిడ్ అధికంగా విస్తరిస్తున్న సమయంలో ఇదేంటని ప్రశ్నిస్తే కోవిడ్ నిబంధనల మేరకే ఎన్నికలు అంటూ ప్రకటించింది… ఎన్నికల వాయిదా విషయంలో ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం వివరణ కోరితే కోవిడ్ నిభందనలు పాటిస్తున్నాం… ఫర్వాలేదు ఎన్నికలు నిర్వహించండని ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెప్పింది… కానీ ప్రభుత్వం చెప్పిందానికీ ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీలు అనుసరిస్తున్నదానికి ఏమాత్రం అసలు సంబంధమే లేదు… ఎన్నికల సంఘం కోవిడ్ నేపథ్యంలో పెట్టిన నిబంధనలకు తూట్లు పొడవడంలో టీఆర్ఎస్ పార్టీ అబ్యర్థులు ముందు వరుసలో ఉండగా మేము ఎం తక్కువ అంటూ ప్రతిపక్ష పార్టీలు సైతం వందల సంఖ్యలో జనాలను, కార్యకర్తలను వేసుకొని ప్రచారం చేస్తున్నారు.

నిబంధనలకు తూట్లు...!- news10.app

ఇదిగో తూట్లు….

ఎన్నికల ప్రచారంలో పదుల సంఖ్యలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారం చేయాలని చెప్తున్న పోటీచేస్తున్న అబ్యర్థులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు… తెల్లవారిందంటే చాలు గుంపులు గుంపులుగా వందలసంఖ్యలో జనాలను, కార్యకర్తలను వెంటేసుకొని డివిజన్ లు తిరుగుతున్నారు… ఓటర్లను కలుస్తూ ఓటు అడుగుతున్నారు… వీరి అత్యుత్సాహం తో ఓటర్లు బయపడిపోతున్నారు… కొందరు కనీసం గేట్ తీయడానికి సైతం జంకుతున్నారు… కొందరైతే ప్రచారంలో పెద్దలు చాలదన్నట్లు చిన్న చిన్న పిల్లలను సైతం పార్టీ కండువా మెడలో వేసి ప్రచారానికి కలియ తిప్పుతున్నారు… చిన్న పిల్లలను ఇలా ప్రచారంలో తిప్పడం నిబంధనలకు విరుద్దమే అయిన వీరికి ఏమాత్రం పట్టడం లేదు. ఇక కొందరు నాయకులకైతే ఎన్నికల సంఘం నిబంధనలు కాదని ప్రచార సమయం ముగిసిన ఎన్నికల సభలు నిర్వహిస్తూన్నారు… ఈ సభల్లో అధిక సంఖ్యలో జనాన్ని పోగేస్తూ మొత్తంగా కోవిడ్ నిభందనలను పాతరేస్తున్నారు… ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు… వరంగల్ నగరంలోని ఫంక్షన్ హాళ్లలో పెద్ద సంఖ్యలో ఓటర్లను రప్పించి సమావేశం నిర్వహిస్తున్న చర్యలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి… ఓ వైపు కోవిడ్ విజృంభిస్తున్న రాజకీయ నాయకులు మాత్రం తమకేం పట్టనట్లు గానే… వారి వారి ఇష్టారీతిన ప్రచారం చేసుకుంటున్నారు… మొన్నటివరకు ఎన్నికలు అవసరమా ప్రచారంతో కోవిడ్ పెరుగుతుంది…. ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలు సైతం వాటిని మొత్తంగా మరిచిపోయి వారు కూడా ఎన్నికల ప్రచారంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు… ఎన్నికల నిబంధనలకు వారు సైతం తూట్లు పొడుస్తూ సమావేశాలు నిర్వహిస్తూ ఓటు వేయండని కోరుతున్నారు… మొత్తానికి కోవిడ్ వేళా పార్టీలన్నీ ఓట్ల కోసం పరుగుపెడుతూ కోవిడ్ నిబంధనలు పాటించకుండా బ్రేకులు లేని ప్రచారంలో దూసుకుపోతున్నారు.