సహకరిస్తారా… చెయ్యిస్తార…?

మొన్నటి దాకా నామినేషన్ల గొడవ…. టికెట్ వచ్చాక రెబల్స్ తో తలనొప్పి. రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకున్నాక వారు సహకరిస్తారా… లేదా? అనే అనుమానంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు బయపడిపోతున్నారట… రెబల్స్ గొడవ బీజేపీ, కాంగ్రెస్ లో కాస్త తక్కువగానే ఉన్న టీఆర్ఎస్ పార్టీలో అధికంగా ఉందట… ఈ పార్టీ నుంచే ఇప్పటివరకు అధికంగా నామినేషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యే ల జోక్యంతో వీరు నామినేషన్ లు విరమించుకున్న డివిజన్లల్లో టికెట్ వచ్చిన అబ్యర్ధులకు సహకరిస్తారా లేక చేయిస్తారా అనే అనుమానం గులాబీ అబ్యర్టుల్లో కలుగుతుందట… టికెట్ రాని వారిని వచ్చిన అబ్యర్థులు కలుపుకొని పోవాలని పార్టీ పెద్దలు చెప్పిన టికెట్ రాణి వారిని కలుపుకొని పోయిన వారు సహకరిస్తారా… లేదా అనే అనుమానం అబ్యర్థులను పట్టి లాగుతుందట… మరో వైపు టికెట్ ఆశించి భంగ పడ్డవారు ప్రచారంలో తిరిగి అన్ని బాగానే చేసిన తీరా వోటింగ్ సమయంలో వారికి సంబంధించిన ఓట్లు అభ్యర్థికి బదిలీ అయ్యేలా చేస్తారా… లేదా వారి అనుచరులకు, సన్నిహితులకు మీ ఇష్టం అంటూ చేతులు దులుపుకుంటే కష్టమే కదా అని అబ్యర్థుల్లో గుబులు పట్టుకుందట.

సహకరిస్తారా... చెయ్యిస్తార...?- news10.app

చెప్పినట్లు వినాలి….

వివిధ డివిజన్లలో నామినేషన్ వేసి టికెట్ రాక ఉపసంహరించుకున్న వారు టికెట్ వచ్చిన వారికి సహకరిస్తాం అని అంటున్న… పోటీ చేస్తున్న అభ్యర్ధి వారు చెప్పినట్లు వినకుంటే కష్టం గానే ఉన్నట్లు తెలుస్తోంది… టికెట్ రాని ఆశావహులు చెప్పినట్లు వినకుంటే ఓటింగ్ సమయం నాటికి ఏ పరిస్థితి ఎటువైపు తిరుగుతుందోనని అబ్యర్థులు వారు చెప్పినట్లు వింటున్నారట. నామినేషన్ లు వేసి ఉపసంహరించుకున్న అబ్యర్థులు ఎక్కువ మంది సీనియర్ లు డివిజన్ లో ఎక్కువగా పరిచయాలు ఉన్న వారు కాగా టికెట్ లభించిన వ్యక్తులు కొందరు కొత్తవారు కావడంతో వీరు చెప్పినట్లు వింటేనే ప్రచారం ముందుకు నడిచేలా ఉందట.

నష్టం చేస్తారా…?

టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేసినవారు… ఉద్యమంలో కొనసాగినవారు, టికెట్ రాక అలక బూనినవారు తమకు ఏమేరకు నష్టం చేస్తారు… దీనిని ఎలా అధిగమించాలని గులాబీ అభ్యర్థులు వ్యూహాలు రచించుకుంటున్నారట. టికెట్ రాని వారు దాదాపు నష్టం… చేయకుండా మాట్లాడుకున్న ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అబ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకొని మొత్తానికి వారిని కలుపుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారట… ఒకవేళ అసంతృప్తులు వినకున్న వారిని ఎలాగో ఓలాగా ఒప్పించి లేదంటే వారు ఎవరు చేపితే వింటారో వారి ద్వారా చెప్పించి అబ్యర్థులు వారిని తమ దారికి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారట.. అంటే టికెట్ రాక అలకబూనిన అబ్యర్థులను బతిమాలి బామాలి మొత్తానికైతే టికెట్ వచ్చిన అబ్యర్థులు వారిని తమవెంట ప్రచారంలో తిప్పుకుంటున్నారన్నమాట… అసలుకే ప్రచారానికి అతితక్కువ సమయం ఉండడంతో ఉన్న సమయంలోనే అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతు అందరిని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట…