అడ్డు లేదు…అనుమతి లేదు తవ్వుడే…..తవ్వుడు

  • అమ్మవారి పేటలో అంతా ఆయన గారిదే హవా
  • ప్రభుత్వ అసైన్డ్ భూమిలో రెండు సంవత్సరాలుగా మొరం తవ్వకాలు
  • అధికారులు వెళ్ళేది లేదు…పనులు ఆపేది లేదు
  • మున్సిపల్ శానిటేషన్ రిసోర్స్ పార్క్ పక్కనే తవ్వకాలు
  • పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టి తరలింపు చోద్యం చూస్తున్న అధికార గణం

ఆయన మట్టి వ్యాపారంలో ఆరితేరిన ఘనుడు. అక్కడ ఇక్కడ అని తేడా ఏమీ లేదు ఎక్కడైనా దూసుకు పోగలడు మట్టి వ్యాపారం చేసి కోట్లు వెనకేసుకొగలడు. ప్రస్తుతం ఈ యన గారి మట్టి దందా వరంగల్ నగరంలోనీ అమ్మవారిపేట ప్రాంతంలో కొనసాగుతుంది. దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి లో మట్టిని యదేచ్చగా తవ్వుకుంటూ పోతున్నాడు. ఇతనే కాదు ఓరుగల్లు వ్యాప్తంగా మట్టి మాఫియా యధేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తోంది.అడ్డు లేదు...అనుమతి లేదు తవ్వుడే.....తవ్వుడు- news10.app నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు అడిగే నాధుడే లేరన్నట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అడ్డూఅదుపు లేకుండా చెరువులు, కుంటల్లోనూ మట్టి తవ్వకాలు చేపట్టడం బహిరంగ రహస్యమే. ..” కాదేదీ మట్టి మాఫియాకు అనర్హం” అన్నట్లుగా చెరువులు, కుంటలే కాదు ప్రభుత్వ భూములు,అసైన్డ్ భూముల్లోనూ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.

అభివృద్ధి పనులకోసం మట్టి అవసరం ఏర్పడుతుంది కదా అనే వాదనను ముందుకు తీసుకురావచ్చు కానీ అవసరానికి మించి, యధేచ్ఛగా నిబంధనలు అతిక్రమించి మట్టితో వ్యాపారం చేయటం, లాభార్జనే ధ్యేయంగా మట్టి తవ్వకాలు చేపట్టడం ఓరుగల్లు వ్యాప్తంగా చైన్ సిస్టమ్ లో మట్టి మాఫియా సాగుతుందనేదిబహిరంగ రహస్యం. ఇది ఇలా ఉంటే వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలంలోని అమ్మవారిపేట శివారులో శానిటేషన్ రిసోర్స్ సెంటర్ కు కేవలం 200 మీటర్ ల దూరంలో మట్టిని తవ్వటం జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇష్టారీతిన మట్టిని జేసీబీ ల తో తవ్వి టిప్పర్ల లో తరలిస్తున్నారు.

అధికారుల అండ…?

నగరం నడిబొడ్డున ఇంత బహిరంగంగా మట్టిని తవ్వి వ్యాపారం కొనసాగిస్తున్నారు అంటే అధికారుల ఆశీస్సులు మట్టి మాఫియా డాన్ కు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . ఇంత యథేచ్ఛగా మట్టిని తవ్వుతున్నా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అధికారులకే తెలియాలి. ఎందుకంటే వేల ట్రిప్పులు టిప్పర్లతో మట్టిని నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టడం ఎవరూ కాదనలేని సాక్ష్యం గా నిలుస్తుంది. దాదాపు 20 పీ ట్ల లోతులో గోతులు తీస్తూ ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా డేంజర్ జోన్ గా మారిపోయింది. ఇంతటి లోతుగా తవ్వకాలు చెరువుల్లో, కుంటల్లో చేపట్టడం , ఎలాంటి హెచ్చరిక బోర్డులు తదితర జాగ్రత చర్యలు చేపట్టకపోవటం ఫలితంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.అడ్డు లేదు...అనుమతి లేదు తవ్వుడే.....తవ్వుడు- news10.app

గతంలోప్రమాదవశాత్తు ఈ లోతైన గుంతల్లో పడి మనుషులు, పశువులు చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కూడా ఉన్నాయి అనేక చోట్ల ఈ ప్రమాదకర ఉన్న తవ్వకాలు చేపట్టడం సాధారణం గా మారింది. అయితే నిబందనలకు విరుద్దంగా చెరువులు, కుంటలు,ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లోనూ మట్టి, మొరం తవ్వకాలు చేపట్టడం జరుగుతుంటే అరికట్టాల్సిన అధికార గణం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం అనుమానాలకు తావిస్తుంది. మట్టి వ్యాపారం ఇంతటి బహిరంగంగా జరుగుతుంటే… రెవెన్యూ , విజిలెన్స్, ఎన్ఫోర్స్మ్ంట్, మైనింగ్ శాఖలు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఇలా వారు ఎందుకు వ్యవహరిస్తున్నారు అధికారులే సమాధానం చెప్పాలి.

మట్టి తవ్వకాల అనుమతులు, మట్టి తవ్వకాలపై మైనింగ్ శాఖ, విజిలెన్స్ అధికారులు, రెవెన్యూశాఖ నిర్థిష్టమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మట్టిమాఫియాకు అడ్డుకట్టవేసి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మైనింగ్ అధికారులు విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నేను బిజీగా ఉన్నా:కాజిపేట తహశీల్దార్

నేను లాక్ డౌన్ కారణంగా బిజీగా ఉన్నాను అమ్మవారిపేట మట్టి తవ్వకాల విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి మట్టిని తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అడ్డు లేదు...అనుమతి లేదు తవ్వుడే.....తవ్వుడు- news10.app

కొత్తగా వచ్చాను: అమ్మవారిపేట VRO

నేను ఒక నెల క్రితమే అమ్మవారి పేట బాధ్యతలు స్వీకరించాను నాకు మట్టి తవ్వకాల విషయం తెలియదు అయినప్పటికీ నేను నా గ్రామ రెవెన్యూ సహాయ అధికారిని ఆ ప్రాంతంలో పరిశీలించమని చెపుతాను అయినా మట్టి తవ్వకాలు మైనింగ్ శాఖ పరిధిలోకి వస్తాయి మేము మైనింగ్ అధికారులకు సమాచారం ఇస్తాము.