మానవత్వం చాటుకున్న మనోజ్ కుమార్

లాక్ డౌన్ నేపథ్యంలో తనకు ఉన్నదాంట్లో నుండి కొంత పది మందికి పంచాలనే ఉద్దేశంతో ఈ రోజు 30 వ డివిజన్ లోని 10 అంగన్వాడీ సెంటర్ లలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పోషకాహార పదార్థాలు పంచడం జరిగింది. TRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ గడిచిన పది రోజుల నుండి 30 వ డివిజన్ లో ఉన్న కుటుంబాలకు నాకు కలిగిన దాంట్లో నుండి శక్తి మేరకు వినయ్ భాస్కర్ గారి ఆదేశానుసారం నిత్యావసర సరుకుల అందచేస్తున్నానని అన్నారు దీనిలో భాగంగానే మా డివిజన్ పరిధిలోని 10 అంగన్వాడీ సెంటర్ ల లో ఉన్న బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పోషక పదార్థాలు అందింస్తున్నామని అన్నారు.మానవత్వం చాటుకున్న మనోజ్ కుమార్- news10.app నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి నా జీవిత భాగస్వామి జ్యోస్న సహకారం మరిచిపోలేనిదని డివిజన్ లో నిత్యావసర సరుకుల పంపిణీ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో నాతోపాటు 15 రోజుల నుండి నా వెంట నడుస్తున్న హరీశ్, విజయ్, సుజిత్, ప్రమోద్, మనుష్,, కిరణ్, సంజు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.మానవత్వం చాటుకున్న మనోజ్ కుమార్- news10.app