విశాఖపట్నం లో దారుణం..గ్యాస్ లీక్ తో పడిపోతున్న జనం

విశాఖపట్నం లో దారుణం జరిగింది.గోపాలపట్నం ఎల్ జీ గ్యాస్ ఫార్మసీలో కెమికల్ గా లీక్ అవడంతో దాదాపు మూడు కిలోమీర్ల మేర విషవాయువు వ్యాప్తి చెంది జనం సతమతమవుతున్నారు. గత రాత్రి ఈ గ్యాస్ లీక్ కాగా కల్ల మంటలు,కళ్ళు కనిపించక పోవడంతో ముగ్గురు స్థానికులు బావిలో పడి మృతి చెందారు. ఈ విష్ వాయువు పీల్చిన జనం ఎక్కడ ఉన్న వారు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నారు.చిన్న పిల్లల పరిస్థితి హృదయ విదారకంగా తయారు అయ్యింది నడుస్తూ నడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు తమకు ఏం జరిగిందో తెలియక అచేతన అవస్థలో నేలపైనే పడుకొని ఉంటున్నారు. చాలామంది ఈ గ్యాస్ లీకేజీ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.విశాఖపట్నం లో దారుణం..గ్యాస్ లీక్ తో పడిపోతున్న జనం- news10.app