థర్డ్ జెండర్స్ ను అన్నివిధాల ఆదుకుంటాం : దాస్యం

లాక్ డౌన్ ప్రారంభం నుంచి అన్ని వర్గాలకు చెందిన నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా పశ్చిమనియోజకవర్గంలోని సుమారు 110 ట్రాన్స్ జెండర్స్ కు బుధవారం రోజు నిత్యావసర వస్తువులతో పాటు శానిటైజర్లను పంపిణీ చేశారు.థర్డ్ జెండర్స్ ను అన్నివిధాల ఆదుకుంటాం : దాస్యం- news10.app

వడ్డేపల్లికి చెందిన రోజనాల వసంత_శ్రీనివాస్ దంపతులు దాతలుగా ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులను అందించారు. హన్మకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ 3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లి గంజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ట్రాన్స్ జెండర్స్ పై తాను పాడిన పాటను మరోసారి ఆలకించి వారిని ఉర్రూతలూగించారు. వారిని పార్వతీ పరమేశ్వరులుగా పోలుస్తూ ట్రాన్స్ జెండర్స్ లో రాహుల్ సిప్లి గంజ్ మనోస్థైర్యాన్ని కలిగించారు. అనంతరం టీఆర్వీకే ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్స్ కు రూ.10 వేల నగదును అందించారు. తెల్లరేషన్ కార్డు లేకుండా, ప్రభుత్వ పథకాలు దరిచేరక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్ జెండర్స్ కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు.

లాక్ డౌన్ లోనే కాకుండా, లాక్ డౌన్ అనంతరం ట్రాన్స్ జెండర్లు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం నుంచి తగు చర్యలు తీసుకుని, వారిని అన్ని విధాల ఆదుకుంటామని దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన ట్రాన్స్ జెండర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, దాతలకు మనస్ఫూర్తిగా వందనాలు తెలిపారు.