ఎమ్మెల్యే గారి పెంపుడు అనుచరులు…

అవును ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కొంతమంది అనుచరులను పెంచి పోషిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి…. తనకు అపఖ్యాతి తెచ్చిపెట్టే పనులు ఎన్నైనా తన అనుచరులు చేసిన ఆ ఎమ్మెల్యే చూసి చూడనట్లు వదిలేస్తున్నారంటే అది నిజమే అనిపిస్తుంది…. నిత్యం తన వెంట తిరిగే వారు కొందరైతే ఓ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు మరికొందరు వీరు ఎమ్మెల్యే పేరుతో చేసే అతి అంతా ఇంతా కాదట… వీరు ఎమ్మెల్యే పేరు చెప్పి ఎంతకైనా తెగిస్తారనే ప్రచారం మండలంలో బాగానే జరుగుతుంది…. వీరికి తోడు ఎమ్మెల్యే బావమరిది సైతం బావ పేరుతో ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది….. తాజాగా శాయంపేట మండలంలో పనిచేస్తున్న ఏపీఎం ను బెదిరించి, తన అనుచర గణం తో కలిసి చితకబాదిన ఘటనలో ఎమ్మెల్యే బావమరిదేనని విమర్శలు వస్తున్నాయి… నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు ఎమ్మెల్యే బంధువులు కూడా ఆయన పేరుచెప్పి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని బాహాటంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… ఇలాంటి వాటివల్ల ఎమ్మెల్యే కు నియోజకవర్గంలో కాస్త మైనస్ గానే మారిన ఎమ్మెల్యే ఏమాత్రం వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఎమ్మెల్యే కావాలనే వీరిని ప్రోత్సహిస్తున్నార….అనే అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి…

ఎమ్మెల్యే గారి పెంపుడు అనుచరులు...- news10.app

అనుచరుల ఇష్టారాజ్యం….

ఆ నియోజకవర్గంలో ప్రధానంగా ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే అనుచరుల పేరుతో కొందరు, బంధువుల పేరుతో మరికొందరు, పదవుల్లో కొనసాగుతూ ఇంకొందరు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… ఇటీవల ఇదే మండలానికి చెందిన వైస్ ఎం పి పి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఓ వివాహితతో చెప్పరాని విధంగా బూతులు మాట్లాడి అడ్డంగా బుక్ కాగా ఈ బూతు సంభాషణల ఆడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కాగా గులాబీ నేతలు తల పట్టుకునే పరిస్థితి వచ్చింది… ఈ వైస్ ఎం పి పి ఎదో ఘనకార్యం చేసినట్లు ఇతగాడికి ఓ గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యే కు మరో దగ్గరి అనుచరుడు మీడియా ప్రతినిధికి ఫోన్ చేసి బూతులతో విరుచుకు పడ్డాడు… మండలంలో ఎమ్మెల్యే అనుచరులు ఎవరిని లెక్కచేయని తనంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పార్టీ పరువు గంగలో కలుపుతూ జనంలో పలుచన చేస్తున్న ఎమ్మెల్యే మాత్రం తనకేం పట్టనట్లు వ్యవహరించడం వల్ల కొంతమంది గులాబీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు… నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో సామాన్య జనం వద్దకు ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు… ఇదే ఎమ్మెల్యే అనుచరులు ప్రభుత్వ పథకాల విషయంలో అతి చొరవ చూపుతూ పథకం వచ్చేలా చూస్తామని నమ్మబలుకుతూ పేద మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫోన్ లు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు నియోజకవర్గ వ్యాప్తంగా వినవస్తున్నాయి… ఇంత జరుగుతున్నా తన అనుచరులను ,బంధువులను ఏమాత్రం గాడిలో పెట్టని ఎమ్మెల్యే ఇకనైనా వారిని సరిదిద్దుతారా లేదా చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here