కావాలనే రప్పిస్తున్నారు….?

వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ పరిధిలోని ఓ ఏ సి పి తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… వరంగల్ ఉమ్మడిజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఈ పోలీస్ సార్ బాగానే వెనుకేసినట్లు తన సొంత శాఖలోనే గుసగుసలు వినపడుతున్నాయి… ఏ విషయాన్నైనా బాగానే మ్యానేజ్ చేయగల ఈ పోలీస్ సార్ పోలీస్ శాఖలో బాగానే పరపతి కూడా సంపాదించినట్లు తెలుస్తుంది… ఈ పరపతి ద్వారా తాను అనుకున్న పనిని క్షణాల్లో చేసుకుంటాడని టాక్ నడుస్తుంది.

కావాలనే రప్పిస్తున్నారు....?- news10.app

కావాలనే రప్పిస్తున్నారు

వరంగల్ పోలీసు కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలో పనీ చేస్తున్న ఈ ఏసీపీ సాబ్ తన పరిధిలో ఏ అధికారి పని చేయాలన్న వాళ్ళు ఆయనకు తెలిసిన వారే ఐయిఉండాలట… అంతే కాదు ఆ అధికారులు గతంలో తన దగ్గర పని చేసిన వారు ఐయిఉండాలట…అలాంటి వారికీ మాత్రమే ఏసీపీ సార్ ఆహ్వానం పలుకుతున్నారని కొందరు అధికారులు బాగా నారాజ్ గా ఉన్నట్లు తెలిసింది. ఏ అధికారికి పోస్టింగ్ కావాలన్న తన పరిధిలో పని చేయాలన్న సార్ గారి పరిచయం తప్పనిసరి అని సమాచారం… ప్రస్తుతం ఈ ఏసీపీ సార్ పనిచేస్తున్న పరిధిలో అధికారులు మెజార్టీ శాతం పరిచయం ఉన్నవారు, గతంలో ఎదో చోట సార్ దగ్గర పనిచేసినవారే కావడం గమనార్హం… ఒక్కసారి సార్ దగ్గర పనిచేస్తున్న అధికారుల జాబితా ను పరిశీలిస్తే సార్ తనదగ్గర పనిచేయడానికి ఎవరికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థమైపోతుంది. మరో విషయం ఏంటంటే పోస్టింగ్ కూడా ఊరికూరికనే రాదట ఒక్కసారి ఏసీపీ సాబ్ తన పరిధిలోకి తెచ్చుకున్నాడంటే తన ఆదేశాలు తప్పక పాటించాలని అధికారులకు హుకుం జారీ చేస్తాడట.

గతంలో పనిచేసిన వారికే పోస్టింగ్

గతంలో తనదగ్గర పనిచేసినవారికే ఏసీపీ సార్ ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారంటే… గతంలో పరకాల సబ్ డివిజన్ లో తనవద్ద పని చేసిన ఓ సీఐ కీ ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలఅయిపోయిన వెంటనే తన పరిధిలో పోస్టింగ్ ఇప్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు ఇదే తాను గతంలో పనిచేసిన పరకాల సబ్ డివిజన్ లో తనవద్ద పనిచేసిన ఓ ఎస్సై కి సైతం కొద్దీ రోజుల క్రితమే తాను పనిచేస్తున్న పరిధిలో ఏసీపీ సాబ్ పోస్టింగ్ ఇప్పించినట్లు తెలిసింది. తన సబ్ డివిజన్ పని చేస్తున్న ఇద్దరు ఎస్సై లకు బదిలీ లేకుండా అటు ఇటు కాస్త మార్పులు చేర్పులు చేసి తిరిగి అదే సబ్ డివిజన్ లో పోస్టింగ్ ఇప్పించుకొన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలాఉంటే మరో ఇద్దరు సీఐల బదిలీకి రంగం సిద్ధం కాగా గతంలో తన దగ్గర పని చేసిన సిఐలకు ఖాళీ ఐయిన చోట పోస్టింగ్ కావాలని సిఫార్సు లేఖలు ఇప్పించుకొన్నారని సమాచారం..

పోలీసు స్టేషన్ల వారిగా మామూళ్లు….?

ఇవన్నీ చేయడం పోస్టింగ్ లు ఇప్పించడం, పరిచయం ఉన్నవారే తన వద్ద పనిచేయడం… గతంలో తనవద్ద పనిచేసిన వారికే పోస్టింగ్ లో ప్రాధాన్యం ఇవ్వడం ఏసీపీ సార్ అసలు ఎందుకు చేస్తున్నట్లు అంటే స్టేషన్ ల వారిగా నెల వారిగా సారుకు ముట్టజెప్పేందుకే ఇంతటి పని చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోస్టింగ్ ఇప్పించి ఉద్యోగం లో గాడ్ పాదర్ ల ఉంటున్న ఏసీపీ సార్ ను తనవద్ద పనిచేస్తున్న అధికారులు నెలనెలా తప్పకుండా ప్రసన్నం చేసుకోవాల్సిందేనట…. అందుకోసమే ఆ అధికారులకోసం ఏసీపీ సార్ ఎంతటి పైరవినైన చేసి తప్పక పోస్టింగ్ ఇప్పిస్తారట. మరి ఈ ఏసీపీ సార్ పై నిఘా వర్గాలు ఎందుకు ఓ కన్నేయడం లేదో…ఉన్నతాధికారుల కు ఈ పోస్టింగ్ ల మర్మం తెలియడం లేదో… పోస్టింగ్ లు లేక ఎదురుచూస్తున్న ఇతర పోలీస్ అధికారుల నిరీక్షణ ఉన్నతాధికారులకు కనపడడం లేదో ఏమో చూడాలి …

ఆ ఏసీపీ సార్…రియలేస్టేట్ కింగ్

సంపాదన కోట్లలో….బినామీల కనుసన్నల్లో…..

మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here