ముందస్తు ప్రచారం…

టికెట్ వస్తుందా… రాదా తర్వాత చూద్దాం.. నాయకులకైతే పోటీ చేస్తాం అని చెప్పాం… పోటీ ఎవరున్న తప్పుకునేది లేదని కూడా చెప్పాం ఇంకేముంది ప్రచారమే కదా… గ్రేటర్ వరంగల్ నగరంలో ఎన్నికలకు ఇంకా నోటీపీకేషన్ రాకముందే ఎన్నికల వేడి పెరుగుతుంటే కొంతమంది ఏకంగా వివిధ డివిజన్ లల్లో ప్రచారాన్ని మొదలుపెట్టారు… అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతున్నారు… అయ్యో అప్పుడే ఎన్నికలు వచ్చాయా అని అడిగితే… ఇంకెన్ని రోజులు దగ్గరకు వచ్చాయి మీ ఓటు మాత్రం మాకేవేయండని అప్పుడే బతిమిలాడుకుంటున్నారు.

ముందస్తు ప్రచారం...- news10.app

తొందరపడుతున్నార…?

వరంగల్ మహానగరంలో ప్రధాన పార్టీలనుంచి ప్రతి డివిజన్ లో పోటీ బాగానే ఉండేట్లు ఉంది… ఆయా పార్టీలనుంచి ఆశావహుల సంఖ్య కూడా బాగానే ఉంది. కానీ పోటీ చేయాలనుకునే అబ్యర్తులు తమకే టిక్కెట్ ఖాయమని కొందరు పరోక్షంగా ప్రచారం చేస్తుంటే ఇంకొందరు ఏకంగా వాల్ పోస్టర్ లు, ఇంటింటి ప్రచారంతో కాసింత ముందస్తు ప్రచారం చేస్తున్నారు. దింతో డివిజన్ ప్రజలు ఇప్పుడే ఏంటి ప్రచారం అనుకుంటున్నారు. ఈ ప్రచారం మాట ఎలా ఉన్నా ఇంత చేశాక పార్టీ టికెట్ ఇవ్వకుంటే పరిస్థితి ఎంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎవరికి వారే టికెట్ తనకే వస్తుందని ఫిక్సయి పోతే రాకుంటే ఎలా అని పార్టీల నాయకులు అంటున్నారు.

టికెట్ పై ఆశలు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వారంతా టికెట్ రాకుంటే ఆయా పార్టీల్లో రెబల్ అవతారం ఎత్తే అవకాశం ఉంది… దీని వల్ల ప్రాధాన పార్టీలకు రెబల్ తలనొప్పులు తప్పేలా లేవు… ఇలా గనుక జరిగితే పార్టీ కి నష్టం జరిగే అవకాశం ఉందని నాయకులు అంటున్నారు… ఓ వైపు సమీక్షలు,బలాబలాల అంచనాలు, సమావేశాలు జరుగుతుంటే ఎవరికి వారే ఇలా ముందస్తు ప్రచారాలు చేసుకోవడం కొన్ని పార్టీల్లో ప్రస్తుతం గందరగోళంగా మారింది… ఈ ముందస్తు ప్రచారాల గొడవ అత్యధికంగా సిట్టింగ్ స్థానాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో తక్కువగానే ఉన్న కాంగ్రెస్ పార్టీలో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందట… ఎవరికి వారే టికెట్ ఖాయమని డిసైడ్ అయిపోయి ప్రచారాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. ఇక మరికొంతమంది తమ గాడ్ ఫాదర్ లపై కోటి ఆశలు పెట్టుకొని వారు టికెట్ ఇప్పిస్తారనే గంపెడు ఆశలతో ఈసారి మనదే అని అనుచరులను పురమాయించి డివిజన్ లల్లో ముందస్తు ప్రచారానికి సిద్ధం అవుతున్నారట… వీరి ముందస్తు ప్రచారాలు, టికెట్ ఆశలు ఎలా ఉన్నా డివిజన్ ప్రజలు మాత్రం “ముందు మురిసినమ్మ పండుగ ఏరిగేనా”… అని కామెంట్లు చేస్తున్నారట.. చూద్దాం ఈ ముందస్తు ప్రచారాలు పార్టీలకు ఎలాంటి తలనొప్పులు తెచ్చి పెడతాయో వేచి చూడాల్సిందే.