నీటి వ్యాపారం పై నిఘా ఏది…?

ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో పట్టణాలు, మండల కేంద్రాలు పలు గ్రామాల్లో ఇంటింటా మినరల్‌ వాటర్‌ వినియోగిస్తున్నారు ఇదే అదునుగా నగరంలో వాడవాడలా వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి నగరం లో వందల్లో అనుమతి లేని ప్లాంట్లు ఉన్నాయి అందులో పదుల సంఖ్యలో మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి ఒక పక్క మండే ఎండలు నీటి కొరత మామూలు నీళ్లు కొంత కలుషితమై ఉండటం వల్ల విరివిగా వాటర్‌ ప్లాంట్లు వెలుస్తున్నాయి అయితే చాలా వాటిని అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్టు సమాచారం కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అనుమతి లేకుండ ప్రమాణాలు పాటించకుండా ప్లాంట్లు నడుపుతున్నారంటే అధికారులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో ఊహించవచ్చు ప్లాంట్లలో అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఒక్కో క్యాన్ ధర 20 నుంచి 30 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

నీటి వ్యాపారం పై నిఘా ఏది...?- news10.app

20 లీటర్ల తయారీకి 2 కు మించి ఖర్చు కాదు మార్కెట్లో మాత్రం 20 నుంచి రూ 30 వరకు అమ్ముతున్నారు హోం డెలివరీకి మరో 5 నుంచి 10 దాకా వసూలు చేస్తున్నారు ఒక్కో కుటుంబం ప్రతి నెలా నీటిపై 150 నుంచి 400 రూపాయల వరకు ఖర్చు చేస్తోందన్నట్టు ధరలను తగ్గించేలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక బస్టాండ్లు రైల్వే స్టేషన్ల కూడళ్లలో విడిగా బాటిళ్ల రూపంలో అమ్మడం ఒక్కో బాటిల్‌ను 5 నుంచి 10 వరకు వసూలు చేస్తున్నారు కొంత మంది నిర్వాహకులు వివిధ బ్రాండెడ్‌ కంపెనీల పేర్లకు దగ్గరగా ఉండే పేర్ల లేబుళ్లు అతికించి 10 నుండి 20 రూపాయల వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

నగరంలో కూలింగ్‌ వాటర్‌ ఇస్తామంటూ అందినకాడికి దోచుకుంటున్నారు ఒక్కొక్క క్యాన్‌ ధర 30 నుండి 40 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విక్రయాలు జరుపుతున్నప్పటికి అధికారులు చోద్యం చూస్తున్నట్టు తెలుస్తుంది ఏదైనా శుభకార్యాలకు నేరుగా క్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు నీటి నాణ్యత తీరును పట్టించుకోవడం లేదని నగరంలో ఏ డివిజన్ లో చూసినప్పటికి కూలింగ్‌ వాటర్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది వాటర్‌ ప్లాంట్లలో వాడే ఫిల్టర్లు రుచి కోసం వాడే కెమికల్స్‌ పైనే నీటి స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది నాసిరకపు పరికరాలు యంత్రాల వల్ల నీళ్లలో నాణ్యత కరువవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి ఈ ప్లాంట్ల పరిసరాల్లో కనీస పరిశుభ్రత ఉండటం లేక నీరు నిల్వ చేసే ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా బాటిళ్లు క్యాన్లను కడగకుండా ఉన్న నీరు తాగితే ఎన్ని రోగాలు వస్తాయో ఊహించవచ్చు అయినా అధికారులు వాటర్‌ప్లాంట్లలో తనిఖీలు చేయడం లేదని తెలుస్తోంది మినరల్ వాటర్ కి.

వేసవిలో మార్చి నెల నుంచి జూన్‌ వరకు శుద్ధజల కేంద్రాల వ్యాపారం జోరుగా ఉంటోంది ఒక్కో క్యాన్‌ 35 నుండి 40 వరకు తీసుకుని ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోతున్నారు దీని ప్రకారం చూస్తే నగరంలో లక్షల రూపాయల నీటి దందా నడుస్తున్నట్టు తెలుస్తుంది విషయం ఏమంటే వేసవిలో ఈ కేంద్రాల నిర్వాహకులు మున్సిపాలిటీ సరఫరా చేసే నీటితోనే వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం అయినా అడిగే అధికారులు కరువయ్యారు ఈ తతంగం అంతా చూస్తూనే అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు తప్పనసిరిగా బీఐఎస్‌ ధ్రువీకరణ పత్రం ఉండాల్సి ఉంటుంది ఆహార తనిఖీ తూనికలు కొలతల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి నగరంలో నిర్వహిస్తున్న ప్లాంట్లలో కొన్నింటికి మాత్రమే ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది మిగిలినవి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నవె.

స్థానిక సంస్థల నుంచి వ్యాపార నిర్వహణకులు అనుమతి తీసుకోవాలి ఇది ఎక్కడా పాటించడం లేదు నగరంలో ఎన్ని ఆర్వో ప్లాంట్లు ఉన్నాయో కూడా అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం
బోరు వేసేందుకు వాల్టా చట్టం కింద రెవెన్యూ భూగర్భ జలవనరుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి దీంతో పాటు నిరభ్యంతర పత్రం కూడా తెచ్చుకోవాలి అప్పుడే విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తారు ఇవన్నీ పాటించకుండానే విద్యుత్‌ సరఫరా ఇస్తున్నారు.

నీటి శుద్ధి కేంద్రంలో విధిగా మైక్రోబయాలజీ రసాయన ప్రయోగ శాలలుండాలని వీటిలో కెమిస్టులను నియమించుకుని బ్యాచ్‌ల వారీగా నీటి నమూనాలను తీసి పరీక్షించాలని వీటికి సంబంధించి ఫలితాలను రికార్డుల్లో నమోదు చేయాలి ప్రతి 3 నెలలకోసారి గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో నీటి పరీక్ష నిర్వహించాలి. నీటి సరఫరా రవాణాకు ఉపయోగించే డబ్బాలను ఐదు దశల్లో శుభ్రపరచాలి నీటిని శుద్ధి చేసిన కంపెనీ తేదీ తదితర వివరాలను డబ్బా పై ముద్రించాలి అనుతిపొందిన ప్లాంట్లు మాత్రమే ఇవి పాటిస్తున్నాయని ప్రతి బ్యాచ్‌కు విధిగా పరీక్షలు నిర్వహించి ప్రమాణాల ప్రకారం ఉంటేనే నీటిని క్యాన్లలో నింపాలి అసలు పరీక్షలే నిర్వహించడం లేదు.

శుద్ధి చేసిన నీటితో ఎలాంటి అనారోగ్యం కలగదని స్థానిక సంస్థలు ధృవపరుస్తూ అనుమతి ఇవ్వాలి. శుద్ధ జలం విక్రయించేందుకు విధిగా నీటిని క్యాన్‌లో నింపేముందు ట్యాంక్‌ను వేడినీటితో శుభ్రం చేయాలి ఆ సమయంలో సిబ్బంది చేతికి గ్లౌజులు తలకు రక్షణగా క్యాప్‌లు తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రత్యేకంగా ఏసీ గదిలోనే నీటిని క్యాన్‌లలో నింపాలి నింపిన వెంటనే క్యాన్‌పై తేదీని ముద్రించాలని నిపుణులు చెపుతున్నారు. వేడినీటితో ప్రతి రోజు శుభ్రం చేయకుండా ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించకుండా నీరు నింపుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో పాచిపట్టిన గోడల మధ్య అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో నెలలు తరబడి యంత్రాలను శుభ్రం చేయకుండా ఫిల్టర్‌ వ్యవస్థ పాడైనా పట్టించుకోకుండా పని కానిచేస్తున్నారు గుర్తింపు పొందడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని నిబంధనలు పాటించాల్సి వస్తుందని రహస్యంగా వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది వాటర్ ప్లాంట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలిసినా అధికారులకు ముడుపులు అందడంతో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.