బొల్లికుంటలో రియల్టర్ల ఇష్టారాజ్యం…

ఏంచేసిన అక్రమ వెంచర్ ల దందా ఆగేలాలేదు… వెంచర్ ల విషయంలో భూమి ఉంటే చాలు ఎవరి ఇష్టారాజ్యం వారిది నడుస్తుంది… నాయకుల పేరుతో ,అధికారుల అండదండలతో కొందరు రియల్టర్ లు రెచ్చిపోతున్నారు… సరిగ్గా ఇలాగే గ్రేటర్ వరంగల్ పరిధిలోని 17 వ డివిజన్ బొల్లికుంటలో అక్రమ వెంచర్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.బొల్లికుంట కేంద్రంగా ఓ నలుగురు వ్యక్తులు అక్రమ వెంచర్ లు చేస్తూ కోట్లు కోల్లగొడుతున్నట్లు తెలిసింది.వీరిలో ఒకరు బంగారం షాపు యజమాని, మరొకరు మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్, ఇంకొకరేమో బొల్లికుంట గ్రామ వాసి ఈ నలుగురు ఓ జట్టుగా ఏర్పడి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు పొందకుండానే అక్రమంగా వెంచర్ లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం…

బొల్లికుంటలో రియల్టర్ల ఇష్టారాజ్యం...- news10.app

మున్సిపల్ అనుమతి లేదు నిబంధనలు అసలే పాటించరు

బొల్లికుంటలో ఇటీవల కాలంలో ఈ నలుగురు అనేక అక్రమ వెంచర్ లు చేసినట్లు తెలిసింది. ఈ నలుగురు కలిసి చేసిన ఏ ఒక్క వెంచర్ కూడా మున్సిపల్ నిబంధనల ప్రకారం అసలే ఉండదట… వీరు ఇప్పటివరకు చేసిన, చేస్తున్న ఏ వెంచర్ కు మున్సిపల్ అనుమతి లేదని తెలిసింది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి తూతుమంత్రంగా ప్లాట్లు చేసి అమ్మడంలో నగరంలో వీరి తర్వాతే ఎవరైనా అని ప్రచారం జరుగుతుంది….

ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి అధికారుల మేనేజ్ ….?

17 వ డివిజన్ బొల్లికుంట కేంద్రంగా అక్రమ వెంచర్ లు చేస్తున్న ఈ నలుగురు నగరంలోని ఓ ఎమ్మెల్యే పేరును బాగానే వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు చేసే అక్రమ వెంచర్ ల పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ ఎమ్మెల్యేకు మేము దగ్గర మనుషులమని తర్వాత మీ ఇష్టమని అధికారులను సైతం బోల్తా కొట్టిస్తూ ఎమ్మెల్యే పేరును బాగానే వాడుతున్నట్లు సమాచారం… దింతో తమకు ఎందుకొచ్చిన తంటా అంటు అధికారులు కనీసం ఆ వెంచర్ ల జోలికి కూడా వెళ్లడం లేదట…ఇప్పుడైనా ఈ వెంచర్ ల విషయంలో అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here