బిఎస్పీలోకి ఆర్ ఎస్ ప్రవీణ్ !

వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.. ఆయన వీఆర్ఎస్‌ తీసుకన్న తర్వాత.. టీఆర్ఎస్‌లో చేరతారు.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి రాగానే వాటిని ఖండించారు.. ఇక, ఆ తర్వాత ఆర్‌ఎస్‌పీ.. బీఎస్పీవైపు అడుగులు వేస్తున్నారని.. ఆ పార్టీలో చేరి.. తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేయడంపై ఫోకస్‌ పెట్టనున్నారనే చర్చసాగింది.. ఆ వార్తలను నిజమేనని తేలిపోయింది.. తాజాగా మీడియాతోమాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాన్షీరాం అడుగుజాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని.. త్వరలోనే ఆయన పార్టీలో చేరతారని ప్రకటించారు.

బిఎస్పీలోకి ఆర్ ఎస్ ప్రవీణ్ !- news10.app

దీంతో.. బీఎస్పీలో చేరేందుకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు గ్నీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు అయ్యింది.. కాగా, బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తిగా ఉన్నట్లు అప్పటి నుంచి టాక్ నడుస్తోంది… గత నెలలో ఆయన యూపీకి వెళ్లి బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అప్పటికే జై భీమ్… జై భారత్ నినాదంతో ఉన్న ఆయన పలు సందర్భాల్లో బహుజనవాదం కూడా వినిపించారు. బీఎస్పీలో చేరుతారనే ప్రచారం ఉండగా.. మాయావతి తాజాగా చేసిన ప్రకటనతో అది తేలిపోయింది.. వంద శాతం పేదల పక్షాన ఉండాలనుకుంటున్నాను. అందుకే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాను. అనేక శాఖల్లో పని చేశాను. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉంది. నా సర్వీసులో కేవలం ఒక్క శాతం మాత్రమే పేదలకు సేవలందించాను. వందశాతం పేదల పక్షాల ఉండాలనే రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.