కలెక్టర్ సార్ కలుగజేసుకోండి…

అడవి రంగాపూర్ ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోండి.
సర్వే నెంబర్ 28 ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నవారిపై చర్యలు తీసుకోండి
అక్రమంగా పట్టా చేసుకొని లక్షల రూపాయలకు ప్రభుత్వ భూమినే అమ్మేశారు..
అడవి రంగాపూర్ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు గ్రామస్తుల వినతి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవీరంగాపూర్ ప్రభుత్వ భూముల కబ్జా విషయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కలుగజేసుకోవాలని అడవీరంగాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలోని సర్వే నంబర్ 28 లో కొంతమంది అక్రమంగా 34 ఎకరాలు పట్టా చేసుకోగా త్వరగా విచారణ చేసి ప్రబుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించింన లాభం లేకుండా పోయిందని వారు అన్నారు. రెవెన్యూ అధికారులు భూముల స్వాధీనం విషయంలో ఆలస్యం చేస్తూ అక్రమ కబ్జా దారులకు దక్కేలా చేస్తున్నారని అనుమానం కలుగుతుందని వారు అన్నారు.

కలెక్టర్ సార్ కలుగజేసుకోండి...- news10.app

కొంతమంది రాజకీయ పలుకుబడితో ఈ సర్వే నంబర్ లో ఏకరాలకొద్ది ఆక్రమించి భూమిని వేరే వారికి అమ్మి లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తిరిగి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా రాజకీయ పైరవీలు కొనసాగిస్తున్నారని వారు అన్నారు. కబ్జా దారుల ఆటలు సాగకుండా 34 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ కు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు విచారణ,సర్వే విషయంలో ఆలస్యం చేయకుండా త్వరితగతిన ముగించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు.

దొంగ పట్టాలు రద్దు చేయాలి కోడారి రాజు

అడవి రంగపూర్ లోని ప్రభుత్వ భూమిని కొంతమంది రెవిన్యూ అధికారులకు డబ్బులిచ్చి దొంగ పట్టాలు చేపించుకున్నారు. ఆపట్టాలను రద్దుచేసి ప్రభుత్వభూమిని స్వాధీనం చేసుకోవాలి. దీనివల్ల పేదలకు న్యాయం జరుగుతుంది

ప్రభుత్వ భూమిని ఆక్రమించారు.. భాషబోయిన రాజు

అడవి రంగాపూర్ గ్రామంలోని 28 సర్వే నెంబర్ లో ఉన్న 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు రాజకీయ పలుకుబడితో ఆక్రమించారు.గ్రామంలో అనేకమంది పేదలు భూమి లేక ఇబ్బందులు పడుతుంటే ఎకరాల కొద్దీ భూమిని కబ్జా పెట్టి అక్రమార్కులు లబ్ది పొందాలని చూస్తున్నారు .ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి.

కబ్జా చేసి అమ్మారు కడారి సంతోష్

గ్రామంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొంతమంది రాజకీయ నాయకులు ఆ భూమిని ఇతరులకు అమ్ముకున్నారు. ఈ విషయం పై రెవిన్యూ అధికారులకు పలుమార్లు పిర్యాదు చేసిన వారు అసలే పట్టించుకోవటం లేదు కలెక్టర్ జోక్యం చేసుకొని గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడాలి .అక్రమార్కుల చేతిలో ఉన్న భూమిని స్వాదినపరుచుకోవాలి.

చర్యలు తీసుకోవాలి నాంపల్లి రాజేందర్

అడవి రంగాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమి ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని పట్టాలు రద్దు చేయాలనని కలెక్టర్ ను కోరుతున్నాం. ఏకంగా 34 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన రెవెన్యూ అధికారులకు కనీసం చీమకుట్టినట్లైన ఎందుకు కావడం లేదు.ఇకనైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. రెవెన్యూ అధికారులు కదిలి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేలా కలెక్టర్ చొరవ చూపాలి.