ఎమ్మెల్యే ‘ధర్మన్న’ ఈ ప్రశ్నలకు బదులేది…..?

ఉద్యమకారులకు సాయం అందకుండా… అడ్డుపడుతున్నదెవరు ?
మంత్రి కేటీఆర్ తీసుకురమ్మన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి ఎందుకంత నిర్లక్ష్యం?
ఉద్యమకారులంటే ఎందుకంత అలుసు… ప్రభుత్వం చొరవ చూపిన ఎమ్మెల్యే అడ్డుకుంటారా…?
ఎన్నికల సమయంలో కష్టపడి గెలుపుకు బాటలు వేసింది ఉద్యమకారులు కాదా…?
ఎన్నికల ముందు ఆమరణ దీక్ష కుదిగారని ఎమ్మెల్యే కు కోపం ఉండొచ్చు…!
ఎమ్మెల్యే రివేంజ్ బాటలో కొనసాగుతూ….ఉద్యమకారుల జీవితాలతో ఆడుకుంటారా…?
ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి చొరవ చూపుతార… జఠిలం చేస్తారా…?
గొర్రెకుంట, ధర్మారం ఉద్యమకారుల ఆవేదనభరిత ప్రశ్నావలి….

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి కొన్ని ప్రశ్నలు సం ధిస్తున్నారు గొర్రెకుంట, ధర్మారం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు.ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఎమ్మెల్యే గెలుపుకోసం పాటుపడిన తమను ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఉండడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. అంతేకాదు ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా చితికి పోయి విద్యా పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తాము 2018 లో ఆమరణ దీక్షకు దిగితే ఎమ్మెల్యే కు నష్టం జరుగుతుందని భాదపడి తమను బుజ్జగించేందుకు రంగంలోకి దిగి ఎమ్మెల్యే కంటే ఎక్కువగా స్పందించి తానే అన్ని అన్నట్లు వ్యవహరించే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు నిమ్మగడ్డ వెంకన్న ఇప్పుడెందుకు మౌనవ్రతం పాటిస్తున్నారని కూడా అడుగుతున్నారు…… ఎమ్మెల్యే తమ సమస్య పట్ల సానుకూలంగా స్పందించకుండా ఉండడానికి నిమ్మగడ్డ వెంకన్న ప్రధాన కారణంగా తాము భావిస్తున్నామని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు న్యూస్10 కు తెలిపారు.ఎమ్మెల్యే చేసే ప్రతి పనిలో తానే ఓ ఎమ్మెల్యే లాగా ప్రవర్తించే నిమ్మగడ్డ వెంకన్న ఎమ్మెల్యే ను తప్పుదారి పట్టిస్తు తమ సమస్య పరిష్కారం కాకుండా చేస్తున్నాడని వారు ఆరోపించారు.

ఎమ్మెల్యే 'ధర్మన్న' ఈ ప్రశ్నలకు బదులేది.....?- news10.app

సాయం అందకుండా చేస్తుందెవరు….?

ఎమ్మెల్యే చేసే ప్రతి వాగ్దానాన్ని తన ఘనకార్యంగా చెప్పుకొనే నిమ్మగడ్డ వెంకన్న విద్యార్థి ఉద్యమ కారులకు సాయం ఏమాత్రం అందకుండా అడ్డుతగులు తున్నట్లు ఉద్యమ కారులు అంటున్నారు.మంత్రి కేటీఆర్ ను కలిసినప్పుడు తియ్యటి మాటలు చెప్పి సాయం అందించినట్లు మాటలు మాట్లాడి ఇప్పుడు వెంకన్న తమ ఊసే ఎత్తడం లేదని అన్నారు.గెలిచాం వారికి సాయం చేయకుంటే ఏమికాదని ఎమ్మెల్యే కు మాటలు చెపుతూ తమ జీవితాలతో అడ్డుకుంటే ఆయనకు ఎం లాభం జరుగుతుందని వారు ప్రశ్నించారు.ఎమ్మెల్యే తో ఎవరు ఎం మాట్లాడాలన్న ఎప్పుడు ఎమ్మెల్యే పక్కనే ఉండే నిమ్మగడ్డ వెంకన్న అన్ని విషయాల్లో తలదూర్చి ఎలా అడ్డుతగులుతాడో తమకు తెలుసని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇతను అవును అంటే అవును కాదు అంటే కాదు అనే ఎమ్మెల్యే దీక్ష సమయంలో మావద్దకు వచ్చిన వెంకన్న మాటకోసమే చూస్తున్నాడేమోనని అనుకుంటున్నామన్నారు..

ఎమ్మెల్యే కు కోపం…

2018 సాధారణ ఎన్నికలకు ముందు తమ సమస్య పరిష్కారం కోసం ఆమరణ నిరాహారదీక్ష కు దిగితే తన నియోజకవర్గం లో జరిగిన దీక్ష కనుక ఎమ్మెల్యే కు తమపై కోపం ఉందని ఈ విషయం టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం అంగీకరిస్తారని ఉద్యమకారులు అన్నారు.ఈ కోపాన్ని తమపై పెట్టుకొని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించకుండా, తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమరణ దీక్ష చేసినందుకు కోపంతో పరకాల ఎమ్మెల్యే తమపై రివేంజ్ ఈ రకంగా తీర్చుకుంటున్నారు కావచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. రివేంజ్ లతో ఎమ్మెల్యే కు కలిగే లాభం ఏమిలేదని దీనివల్ల విద్యార్థి ఉద్యమకారుల జీవితాలతో ఎమ్మెల్యే ఆడుకున్నట్లు అవుతుందన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే తమ సమస్యను పరిష్కరించదలుచుకున్నార….లేదా సమస్యను మరింత జఠిలం చేయ దలుచుకున్నారో స్పష్టం చేయాలని వారు కోరారు మంత్రి కేటీఆర్ తమను తీసుకురమ్మని చెప్పిన , ప్రభుత్వం సాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చిన కేవలం ఆయనతో మాట్లాడి తమకు సాయం అందేలా చూసేందుకు ఎమ్మెల్యే కు ఎందుకు మనసు రావడం లేదని వారు ప్రశ్నించారు. ఉద్యమకారుల ప్రశ్నలన్నింటికి బదులు ఇవ్వకుండా, సమస్య పరిష్కారం చేయకుండా ఎమ్మెల్యే మౌనం వహిస్తే తమను ఆదుకునే వారు ఎవరని వారు అడుగుతున్నారు. ఇకనైనా మౌనం వీడి ఉద్యమ కారులకు పెద్ద మనస్సుతో సాయం అందేలా సహకరించాలని వారు కోరారు.

ఎమ్మెల్యే మౌనం వీడాలి ల్యాదల్ల. ప్రవీణ్ ,సిలివేరు నవరత్నం. గొర్రెకుంట

తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపిన విద్యార్థి ఉద్యమకారుల విషయంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఉపాధి పరంగా ఆర్థికంగా మేము చితికిపోయము ఆనాడు ఆమరణనిరాహారదీక్ష సమయంలో ఎమ్మెల్యే దూతగా మా దగ్గరికి వచ్చి మా చేత దీక్ష దీక్ష విరమింపజేసిన ప్రస్తుత రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకన్న ఈ రోజు మా విషయంలో స్పందించకపోవడం చాలా బాధగా ఉంది కే టి ఆర్ గారి మీద మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము ఎమ్మెల్యే సాక్షిగా మాకు ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే మమ్మల్ని తీసుకుని తన వద్దకు రావాలని కే టి ఆర్ గారు ధర్మారెడ్డి గారికి చెప్పారు కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఆ మాటను(కే టి ఆర్ మాటను) ఎమ్మెల్యే గారు లెక్కచేయకుండా మా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికయినా ఎమ్మెల్యే గారు స్పందించి మమ్మల్ని కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక శ్రద్ధతో మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి దయచేసి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లాలి గాదె సందీప్ ధర్మారం

ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో ఉద్యమకారులకే న్యాయం జరగడం లేదు ఉద్యమ సమయంలో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం కానీ స్వరాష్ట్రం లో నిర్లక్ష్యానికి గురవుతున్నాం ఆనాడు జైలులో గర్వంగా గడిపినం ఈ రోజు ఆ పరిస్థితి లేదు మా పార్టీ(తెరాస)గుర్తించి న్యాయం చేయాలని ఆమరణ నిరాహారదీక్ష చేసినం పార్టీ గుర్తించి చల్లా ఆధ్వర్యంలో మమ్మల్ని కే టి ఆర్ గారు తన వద్దకు పిలిపించుకుని మా కష్ట నష్టాలను విన్న ఆయన ధర్మన్న వీరికి మనం తగిన న్యాయం చేయాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వ్యవధిలోనే వీరిని తీసుకొని రా అన్న (ధర్మన్న) అని చెప్పి రెండు సంవత్సరాలు అయింది అయినా మమ్మల్ని కే టి ఆర్ గారి వద్దకు ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకపోవడం లేదో మాకు అర్థం కావడం లేదు ధర్మారెడ్డి గారికి దయచేసి దండం పెట్టి చెప్తున్న మమ్మల్ని కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లండి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి.