ఓ ఎస్సై బరితెగింపు తనం

అవును ఇది ఓ ఎస్డై బరితెగింపు తనం… తాను ఖాకీ ని ఏదైనా చేయవచ్చన్న పనికిమాలిన ధీమా… సామాన్యులుఅంటే లెక్కలేనితనం…నోటికి ఎన్ని బండ బూతులు వస్తే అన్ని తిట్టవచ్చు… సర్కార్ పెద్దలు పదే పదే వల్లెవేస్తున్న ప్రెండ్ల్లి పోలీసింగ్ ను మంటగలపొచ్చు ప్రశ్నించిన పాపానికి లాఠీలతో చావబాధచ్చు… ఇవన్నీ ఆ ఎస్సై బాగానే ఒంటబట్టించుకున్నట్లు ఉంది. ఓ సామాన్య రైతుపై తన పోలీస్ బలాన్ని ఉపయోగించి కుళ్లబోడిసాడు… శరీరంలో ఇక్కడ అక్కడా అని కాకుండా ఎక్కడ బడితే అక్కడ కొట్టి ఆ రైతు మంచానికే పరిమితం అయ్యేలా చేసాడు.

ఓ ఎస్సై బరితెగింపు తనం- news10.app

ఎస్సై అనగానే జనాన్ని ఎం చేసిన అడిగేవారు ఎవరు ఉండరు… ఇష్టారీతిన వ్యవహరించవచ్చు అనుకున్నాడో… తనకు తప్ప ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు అనుకున్నాడో తెలియదు కాని అకారణంగా రైతును దూషిస్తూ, తన కానిస్టేబుళ్లతో కలిసి తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. బాధితుడు అందించిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన శనిగరపు శ్రీను ఎదో పనినిమిత్తం ఈ నెల 22 న రేగొండ మండల కేంద్రానికి వెళ్లాడు. పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళుతున్న తనను అక్కడే వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఆపి ఆర్సీ , లైసెన్స్ ఏదని ప్రశ్నించారు… తనది కొత్త వాహనం అని దరఖాస్తూ చేసి ఆరు నెలలు ఐయిన కార్డు రాలేదని, ఆన్లైన్ లో లైసెన్స్, ఆర్సీ కనపడుతుందని అక్కడ తనిఖీలు చేస్తున్న మాహిళ ఏ ఎస్సై కి రైతు సమాధానం చెప్పాడు. ఐయిన ఆ ఏ ఎస్సై ఐదు వందల రూపాయల ఫైన్ రైతుకు విధించింది… తన వద్ద డబ్బులు లేవని అకారణంగా తనకు పైన్ ఎందుకు వేశారని రైతు ప్రశ్నించాడు. దింతో కోపం వచ్చిన ఏ ఎస్సై మేడం రైతు బైక్ ను పోలీస్ స్టేషన్ తరలించింది. దింతో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిన రైతు సివిల్ డ్రెస్ లో ఉన్న ఎస్సై ని తనకు అకారణంగా పైన్ ఎందుకు విధించారని ప్రశ్నించాడు.. అంతే తననే ప్రశ్నిస్తావ….?అంటూ రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి రైతును బూటు కాలితో తన్నుతూ బూతులు తిడుతూ… శ్రీకాంత్ రెడ్డి అంటే ఎవరనుకుంటున్నావురా… శ్రీకాంత్ రెడ్డి సర్ అని పిలువు అంటూ దూషిస్తూ కొంతమంది కానిస్టేబుళ్ల ను పిలిపించి లాఠీలతో ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. దింతో రైతు బొటనవేలు విరిగిపోయింది. పక్కటెముకలు సైతం విరిగిపోయాయి. దింతో కొంత తేరుకున్న పోలీసులు స్థానిక ఆర్ ఎం పి తో వైద్యం చేయించి ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లిన రైతు నొప్పులు ఎక్కువకావడంతో ఎంజీఎం వెళ్లగా వైద్యం చేసిన డాక్టర్లు కాలి బొటన వేలు పూర్తిగా చిట్లడంతో రాడ్ వేశారు… పక్కటెముకలు విరిగాయని చెప్పారు. అప్పటినుంచి ఆ రైతు ఇప్పటికి మంచానికే పరిమితం కాగా కుటుంబసభ్యులు అతని బాధను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అకారణంగా బూతులు తిడుతూ తనను ఇష్టం వచ్చినట్లు చితకబాదిన రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీను పోలీస్ ఉన్నతాధికారులను కోరుతున్నాడు. ఈ మేరకు భూపాలపల్లి ఎస్పీ , రేగొండ ఎస్ ఎచ్ ఓ కు పిర్యాదు చేసారు. ఓ సామాన్య రైతు పై తన హీరోయిజం ప్రదర్శించిన ఎస్సై పై పోలీస్ ఉన్నతాధికారులు ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here