సార్ నేను చూసుకుంటా…?

ఆయన హన్మకొండలోని ప్రముఖ టి బి ఆసుపత్రికి సూపరింటెండెంట్ ఆ డాక్టర్ సారు కొలువు ఇక్కడే కానీ ఆ సారు ఉండేది మాత్రం రాష్ట్ర రాజధానిలో… అక్కడనుంచి ఇక్కడకు నిత్యం రావాలంటే కష్టమే కనుక డాక్టర్ సాబ్ ఇక అక్కడే స్థిరపడి పోయాడట… నౌకరి ఇక్కడ ఉన్న ఎవరు పోతారులే అంత దూరం అని నిత్యం విధులకు డుమ్మా కొడుతూనే ఉన్నారు… డి ఎం ఈ తో సహా ఉన్నతాధికారులంతా ఆ సూపరింటెండెంట్ సారు విధులకు రాకున్నా మంచిదే అన్నట్లు ఎవరి స్థాయిలో వారు ఆ సారుకు సహకరిస్తున్నారట… ఇంకేముంది సారు కనీసం హాజరు పట్టిక లో సంతకాలు పెట్టడానికి కూడా కనీసం ఆసుపత్రి మొహం చూడకుండా తన సిబ్బంది ద్వారే అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకుని సంతకాలు పెట్టేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి… తనకు ఎప్పుడన్నా ఆసుపత్రి మొహం చూడాలని యాదికొస్తే అది నెలలో ఓ నాలుగు రోజులు అలా వచ్చి ఇలా పోతారట.. ఇదంతా ఒక ఎత్తయితే ఇక్కడ పని చేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ సారుకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరి పోస్తున్నారట… మీడియాలో వార్తలు వస్తాయి సార్… అది కామన్ అవేమి మీరు పట్టించుకోకండి హాయిగా ఇంట్లోనే ఉండిపోండి అంతా నేను చూసుకుంట అని అభయహస్తం ఇస్తున్నారట.. పత్రికలో వార్తలు వస్తున్నాయి సార్ ను రెగ్యులర్ గా ఆసుపత్రికి రమ్మనండి అని ఇతర సిబ్బంది సూచిస్తే లైట్ తీసుకోండి వార్తలు అలాగే వస్తాయి అంటూ వారి మాటలు చాలా ఈజీగా కొట్టిపారేస్తున్నాడట.

సార్ నేను చూసుకుంటా...?- news10.app

ఆసుపత్రిలో అన్ని ఆయనే….?

విధులకు అసలే హాజరు కానీ సూపరిండెంట్… ఏదైనా సమాచారం కావాలంటే సీనియర్ అసిస్టెంట్ పైనే ఆధారపడుతాడట దింతో టి బి ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పుతున్నాడట. సూపరింటెండెంట్ ఆసుపత్రి రాకపోవడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఇతగాడు ఆసుపత్రిలో ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ తోటి సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన ఆధిపత్యం కొనసాగించడం కోసమే సూపరింటెండెంట్ ఆసుపత్రికి రాకుండా అంతా చూసుకుంటానని హామీ ఇస్తున్నట్లు తెలిసింది.

ఎస్ ఆర్ ఇవ్వకుండా జాప్యం…?

హన్మకొండ లోని టి బి ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ పై ఆరోపణలు బాగానే వినపడుతున్నాయి. ఇటీవల బదిలీల్లో భాగంగా ఇక్కడనుంచి ఇతర ఆసుపత్రులకు,ఇతర జిల్లాలకు బదిలీ ఐయిన ఉద్యోగులకు ఎస్ ఆర్ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికి తమ ఎస్ ఆర్ కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న ఏవో సాకులు చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. తాను డిమాండ్ చేసింది సమర్పిస్తేనే ఎస్ ఆర్ ఇస్తానని ఉద్యోగులతో పరోక్షంగా ఈ సీనియర్ అసిస్టెంట్ ప్రస్తావించినట్లు తెలియవచ్చింది. ఎంతో కొంత ముట్టజెప్పితే తప్ప ఇతగాడు ఉద్యోగులకు ఎస్ ఆర్ ఇవ్వనని తెగేసి చెప్పినట్లు విమర్శలు వస్తున్నాయి. కాగా ఆసుపత్రిలో ఏ పని కావాలన్న తనను కలవాల్సిందేనట ఇతను చెప్పకుండా ఈ ఆసుపత్రిలో ఏపని కాదట.

(సూపరింటెండెంట్ సారు ఇదేందీ….?)
రేపటి సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here