మట్టి మాఫియా ప(తి)రుపతి

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మట్టి మాఫియా పరపతి అంతాఇంతా కాదు. వారు కోట్లు కూడబెట్టేందుకు ఏదయినా చేస్తారు. ఏ చెరువైన అదురు బెదురు లేకుండా తవ్వేస్తారు. అధికారుల అనుమతులు గ్రామస్తుల ఇష్ట ఇష్టాలతో వీరికి అసలు అవసరమే లేదు. మట్టి తవ్వాలనుకుంటే చాలు పెద్ద పెద్ద వాహనాలు చెరువు లోకి దింపి రాత్రింబవళ్లు తవ్వుతూనే ఉంటారు. అక్రమంగా మట్టిని తవ్వుతూనే ఉంటారు. నిజానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ మట్టి మాఫియా చెరువులను తమ సొంత ఆస్తులుగా భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.మట్టి మాఫియా ప(తి)రుపతి- news10.app

మామునురు చెరువు లో ఇష్టారాజ్యం

వరంగల్ అర్బన్ జిల్లా మామునురు తోట చెరువులో ఓ మట్టి వ్యాపారి తన ఇష్టా రీతిన తవ్వకాలు జరిపి మట్టిని విక్రహిస్తున్నాడు. అడ్డు అదుపు లేకుండా మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రశ్నించేవారు లేక చెరువులో ప్రోక్రినర్లు, జె సి బి లు పెట్టి అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నాడు. తన ప(తి)రుపతి ని ఉపయోగించి కాసుల వర్షం కురుపించుకుంటున్నాడు. అధికారులను సైతం లెక్కచేయకుండా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వేసి అమ్ముకుంటున్నారు. గత కొద్ది రోజులుగా మామునూరు చెరువులో తవ్వకాలు కొనసాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దింతో చెరువులో దాదాపు 20 ఫీట్లకు పైగా తవ్వి పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నారు. గత కొద్ది రోజులు క్రితం ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు ఇదే చెరువు నుంచి మట్టిని తరలించగా ప్రస్తుతం ఓ మట్టి వ్యాపారి గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ పనులకోసమేనని మట్టిని అక్రమంగా తవ్వుతు లోడ్ల కొద్దీ మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నాడు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.మట్టి మాఫియా ప(తి)రుపతి- news10.app మట్టి మాఫియా ప(తి)రుపతి- news10.app మట్టి మాఫియా ప(తి)రుపతి- news10.app మట్టి మాఫియా ప(తి)రుపతి- news10.app