తహసీల్దార్ ద్విపాత్రాభినయం…

పేదల భూములే టార్గెట్ గా పావులు కదుపుతున్న అధికారి

హన్మకొండ జిల్లాలో గత కొన్నిసంవత్సరాలుగా వివిధ మండలాల్లో తహసీల్దార్ గా పని చేసిన ఈ తహసీల్దార్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూశాఖ లో ప్రచారం సాగుతుందట.వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఓ మండలానికి ప్రస్తుతం తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ఈ సారు తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తూనే రియల్ ఎస్టేట్ రంగంలో బాగానే రానిస్తున్నట్లు సమాచారం.

తహసీల్దార్ ద్విపాత్రాభినయం...- news10.app

రెవెన్యూ లోపాలను సరిదిద్దాల్సిన సదరు అధికారి రెవెన్యూ లోని కొన్ని లోపాలను ఆసరాగా చేసుకుని రియల్టర్ గా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు ను ఆనుకొని ఉన్న ఓ గ్రామానికి చెందిన రైతు 25 సంవత్సరాలుగా మోకా మీద ఉండి వ్యవసాయం చేసుకుంటుంటే ఆ భూమి పై కన్నేసిన తహసీల్దార్ ఆ రైతు కు మాయమాటలు చెప్పి భూమి నువ్వు కొన్నది వాస్తవమే కానీ పట్టాలో నీ పేరు లేదని నీ భూమిని అమ్ముకుంటేనే మంచిదని లేదంటే పట్టాదారుకే పాస్ బుక్ చేయాల్సి ఉంటుందని నవ్వుతూ బెదిరించాడట.

అంతటితో ఆగకుండా ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ఒకరున్నారని అంతా ఆయన చూసుకుంటాడాని తన బినామినే ఆ భూమి కొనేలా పావులు కదుపుతున్నాడని సమాచారం. అప్పటినుండి ఆ గ్రామంలో ఎక్కడ చూసిన, నలుగురు కలుసుకున్నా ఈ తహసీల్దార్ గురించే మాట్లాడుకుంటున్నారట.ఈ సారు గతంలో పని చేసిన ఓ మండలంలో అనేక అసైన్డ్ భూములకు సైతం పాస్ బుక్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న మండలం లో 6 నెలల క్రితం ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న ఓ గుట్టకు సైతం పాస్ బుక్ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గుట్టకు పాస్ బుక్ ఇవ్వడం వెనకాల లక్షల రూపాయలు చేతులు మారినట్లు వినికిడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here