అవి దొంగ ఎదురుకాల్పులు

ముసలమ్మ గుట్ట ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఖండన
జే ఎం డబ్ల్యూ పి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేర లేఖ విడుదల
ఎన్కౌంటర్ హత్యకు పాల్పడిన పోలీసులను శిక్షించాలని డిమాండ్

ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పులు బూటకపు ఎదురు కాల్పులని మావోయిస్టు పార్టీ జే ఎం డబ్ల్యూ పి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఆరోపించారు… ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ను ఖండిస్తూ ఆయన ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అక్టోబర్ 18న మరో ఇద్దరు ఆదివాసి బిడ్డలను హత్య చేసిందని, ఆదివాసీ బిడ్డల హత్యలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ ఎన్కౌంటర్ పై ప్రజా హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి హై కోర్టు ద్వారా న్యాయ విచారణ చేపట్టి హత్యలకు పాల్పడిన పోలీసులు కఠినంగా శిక్షించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నమారణహోమాన్ని ఆపే వరకు తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వివిధ పార్టీల ప్రజా సంఘాల వారు ప్రతిఘటించిపోరాడాలని వెంకటేష్ పిలుపు నిచ్చారు. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తుంది నిరంకుశ పాలన కొనసాగిస్తోందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు చేసిన హత్యాలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు.