ముచ్చటగా మూడెకరాల్లో…. అనుమతి లేని వెంచర్….!

దామెర మండలం ఒగ్లాపూర్ లో ఏ అనుమతి లేని వెంచర్
కుడా అనుమతి లేకుండా వెంచర్ దందా
నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు
కుడా అధికారులు పోరు… తనిఖీ చేయరు

వెంచర్ల విషయంలో ఎవరి ఇష్టం వారిదిగా కొనసాగుతుంది. ఖాళీ భూమి ఉంటే చాలు అడ్డు అదుపు లేకుండా వెంచర్ వేసి రియల్ వ్యాపారాన్ని అడ్డగోలుగా కొనసాగిస్తున్నారు. నగరశివారుకు పది కిలోమీటర్ల పై ఉన్న వెంచర్లు ఏవి కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి రియల్ వ్యాపారం కొనసాగిస్తున్న వీరు అనుమతుల విషయంలో మాకేం అవసరం లేదు అన్నట్లు గానే వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ భూమిని నివాస యోగ్యమైన భూమిగా కేవలం నాల కన్వర్షన్ చేసి వెంచర్ దందాను నిరాటంకంగా వీరు కొనసాగిస్తున్నారు. కానీ కూడా అనుమతులకు మాత్రం వీరు ససేమిరా అంటున్నారు.ముచ్చటగా మూడెకరాల్లో.... అనుమతి లేని వెంచర్....!- news10.app

ఒగ్లాపూర్ లో 3ఎకరాల వెంచర్

నగరానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో కుడా పరిధిలో దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామ శివారులో 3 ఎకరాల్లో కొందరు రియలటర్లు వెంచర్ వేసి రియల్ దందాను కొనసాగిస్తున్నారు. కేవలం నాలకన్వర్షన్ చేయించి కుడా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా ఈ వెంచర్ ను నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ఇక్కడ ప్లాట్ల అమ్మకాలను ప్రారంభించారు. కుడా నిబంధనలను ఎంత మాత్రం పట్టించుకోకుండా కుడా పరిధికి చాలా దూరంలో ఉన్నాం… అధికారులేవరు రారు లే అనే ధీమాలో వీరు వెంచర్ ను కొనాసాగిస్తున్నట్లు తెలిసింది.ముచ్చటగా మూడెకరాల్లో.... అనుమతి లేని వెంచర్....!- news10.app

అధికారులు దృష్టి పెట్టండి…

దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామ శివారులో 3 ఎకరాల భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వెంచర్ పై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుడా ఆదాయానికి గండి కొడుతూ ఎలాంటి అనుమతులు లేకున్నా అమ్మకాలు కొనసాగిస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో కుడా అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.