ఎమ్మెల్సీ టికెట్ రేస్ లో వన్నాల పావన!

వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు. ఓబిసి మెూర్చ కర్నాటక రాష్ట్ర ఇంచార్జి వన్నాల శ్రీరాములు కోడలు వన్నాల పావన పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు నల్గొండ, వరంగల్,ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియెూజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ టిక్కెట్ రేస్ లో వన్నాల పావన నిలిచారు.

ఎమ్మెల్సీ టికెట్ రేస్ లో వన్నాల పావన!- news10.app

ఈ మేరకు బుదవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ లోక సభ సభ్యులు బండి సంజయ్ ను కలిసి ఆమె ధరకాస్తు అందజేశారు. బిసి మహిళను రంగంలోకి దించాలని బిజేపి అధిష్టాణం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు తన కోడలు వన్నాల పవన ను ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నియెూజక వర్గం నుండి బిజెపి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో బిసి మహిళ వన్నాల పావన కావడంలో తన అభ్యర్థిత్వాన్ని అధిష్టాణం సీరియస్ గా పరిశీలించే అవకాశం ఉందని వన్నాల పావన ఆశాభావం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ తన అభ్యర్థిత్వం పరిశీలిస్తామని హామి ఇచ్చారని ఆమె తెలిపారు. అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగపురం కిషన్ రెడ్డి, బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి పోలుసాని మురళీధర్ రావు లకు కూడా తన అభ్యర్థిత్వం ఖరారు చేయాలని కోరుతూ ధరకాస్తులు పంపనున్నట్లు వన్నాల పావన తెలిపారు. తన మామ సీనియర్ బిజేపి నాయకులు కావడంతో తామంతా బిజేపి లోనే కొనసాగుతున్నామన వన్నాల పావన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నాయకులు గాడిపెల్లి రాజేశ్వర్ రావు లు పాల్గొన్నారు.