ఆ బీట్ ఆఫీసర్ పై ఎందుకంత ప్రేమ….?

కంచె చేను మేసిన చందంగా అటవి సంపదను బయటకి తరలించి సొమ్ము చేసుకుంటు బరితెగించినట్లు ఆరోపణలు వచ్చిన ఓ బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడానికి అటవీ శాఖ ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు… భూపాలపల్లి జిల్లా గుర్రంపేట్ బిట్ పరిధిలోని భారీ వృక్షాలను నరికించి అడవి దాటించేస్తు…. కాపాల దారులను పురమాయించి, వినకుంటే వారిని బెదిరించి అడ్డగోలుగా అమ్ముతున్నట్లుగా అని గత నెలలో ఒక బీట్ ఆఫీసర్ పై ఫిబ్రవరి 10 న న్యూస్10 దినపత్రికలో ‘బీట్ ఆఫీసర్ బరితెగించాడు’ అనే శీర్షిక తో వార్త ప్రచురించగా దానిపై స్పందించిన ఫారెస్ట్ ఉన్నతాధికారులు విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు కానీ ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోపోగా అతనిని అదే బీట్ లో కొనసాగిస్తున్నట్లు తెలిసింది కలపను అక్రమంగా అడవి దాటించి అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇతగాడిపై అటవీ శాఖ ఉన్నతాధికారులు వల్లమాలిన ప్రేమను ప్రదర్ధిస్తున్నారు… కాపాలదారులను పురమాయిముచి ఈ బీట్ ఆఫీసర్ అక్రమంగా కలప అమ్ముకుంటున్నాడని ఆధారాలతో సహా తెలిసిన అధికారులు మాత్రం ఇతడిని ఏమిచేయలేక పోతున్నారు.. మరి ఇంతకు అతని పై చర్యలు ఏమైనట్లు అని అటవీ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్న అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

ఆ బీట్ ఆఫీసర్ పై ఎందుకంత ప్రేమ....?- news10.app

ఇది ఇలావుంటే అధికారులతో సహా యూనియన్ నాయకులను తాను ప్రసన్నం చేసుకున్నట్లు సదరు బీట్ ఆఫీసర్ తోటి ఉద్యోగులతో గొప్పగా చెప్పుకుంటున్నట్లు విశ్వసనీయంగా సమాచారం. అందుకే తనను అధికారులు ఎవరు ఏమి అనడం లేదని తనపై చర్యలు కూడా తీసుకోరని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బిట్ ఆఫీసర్ బయట చెప్పుకుంటున్నట్లే యూనియన్ లీడర్లతో సహా పై అధికారులకు సదరు బీట్ అధికారి డబ్బు ముట్టచెప్పాడా…. అందుకే విచారణ ముందుకు సాగక చర్యలు తీసుకోలేకపోతున్నారా… అనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి… అడవిలో యథేచ్ఛగా పెద్ద పెద్ద వృక్షాలను నరికివేసి అటవీ ప్రాంతం దాటిస్తున్న ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు.. ఇలాంటి అక్రమార్కులే అటవీ శాఖకు సరైన ఆఫీసర్ అని ఉన్నతాధికారులు భావిస్తున్నారా….? లేక ఇలాంటి అడవులు అమ్ముకునే వారు ఉంటేనే పై అధికారులకు కావాల్సింది అందుతుందని భావిస్తున్నారా ఏమాత్రం అర్థం కావడంలేదు… గుర్రంపొడు బీట్ అధికారిపై మూడు నెలల క్రితం ఆరోపణలు వచ్చిన ఇప్పటికి ఆదికారులు స్పందించక పోవడం ఆ బీట్ అధికారి వీరి గురించి చేస్తున్న ప్రచారం నిజమే కావచ్చని పలువురు అంటున్నారు…ఇప్పటికైనా ఈ బీట్ అధికారిపై అటవీ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా… లేదా వేచిచూడాలి.