అంతటా అంతేనా….?

హన్మకొండ జిల్లా కమలాపూర్ లోని ఓ మిల్లు లో విజిలెన్స్ తనిఖీ లో 80 వేల బస్తాలు సుమారు ఏడున్నర కోట్ల రూపాయల ధాన్యం మాయం కావడం…ఆ ధాన్యం బియ్యం గా మారి పలు రైస్ డిపోలకు తరలిందనే అనుమానాలు జిల్లాలో సంచలనం కలిగిస్తుంది…విజిలెన్స్ ఈ జిల్లాలో మరిన్ని తనిఖీలు చేస్తే ఇంకా నిజాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది…అంతేకాదు సర్కార్ కేటాయించిన ధాన్యాన్ని పక్కదారిపట్టించి సొమ్ముచేసుకోవడం అనే జాడ్యం ఈ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో సైతం ఉందా…?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…అధికారులు ఖచ్చితంగా దృష్టి సారిస్తే ధాన్యం ధాన్యం పక్కదారి పట్టకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి….

తిలా పాపం తలా పిడికెడు….


హన్మకొండ జిల్లాలోని సివిల్ సప్లయీస్ శాఖలో “తిలా పాపం తలా పిడికెడు” అన్న చందంగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి…ధాన్యం కేటాయించడం ఆ తర్వాత మిల్లులకు కేటాయించిన ఆ ధాన్యం ఏమవుతుందో కనీస పర్యవేక్షణ అధికారులు చేయకపోవడం …ఫిజికల్ వెరిపీకేషన్ సరిగా నిర్వహించక పోవడం ,మరికొన్ని చోట్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడి పెత్తనం అంతా వారికి అప్పగించడం వల్ల కొందరు మిల్లర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మిల్లర్ల లోనే ప్రచారం సాగుతోంది… మరోవైపు కొందరు అధికారులు వారికి అన్ని విధాలుగా సహకరించిన కొందరు మిల్లర్లను చేరదీసి వారేం చేసిన చూసి చూడనట్లు వదిలేయడం,అవసరం ఉంటే వారికి సహకరించడం వల్ల ధాన్యం పక్కదారి పట్టి సర్కార్ ఖజానాకు గండి పడుతోందని సమాచారం…ఇలా ధాన్యం పక్కదారి పట్టించి అమ్మి సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లపై ఆర్ ఆర్ యాక్ట్ అమలు చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ మీన మేషాలు లెక్కించడం అవినీతి చేసే మిల్లర్లకు ఏమాత్రం భయం లేకుండా పోతుందనే వాదన సైతం లేకపోలేదు…అందుకే విజిలెన్స్ అధికారులు మరింతగా పకడ్బందీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది… విజిలెన్స్ అన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తే హన్మకొండ జిల్లాలో ధాన్యాన్ని మాయం చేసిన మిల్లర్లు ఎంత మందో …? బయటపడే అవకాశం ఉంది…

విజిలెన్స్ రిపోర్ట్ లో ఏముంది…?

హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ లోని మిల్లులో 80 వేల బస్తాల ధాన్యం మాయం ఐయిందని సివిల్ సప్లయీస్ అధికారులకు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం..ఆర్ ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని సూచించడం ప్రస్తుతం మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది…దింతో పాటు అసలు విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో ఇంకా ఏముందనే ఉత్కంఠ ,టెన్షన్ మిల్లర్లలో ఉన్నట్లు తెలుస్తుంది…కాగా కమలాపూర్ మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవడానికి ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది…హన్మకొండ జిల్లా ఆడిషనల్ కలెక్టర్ సెలవులో ఉన్నందువల్ల ఆలస్యం అవుతుందని తెలుస్తుంది…ఆర్ ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు విషయంలో ఆడిషనల్ కలెక్టర్ వస్తేనే ఎంజరుగుతుందో తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది… మరి ఈ విషయంలో ఆయన ఎలా స్పందిస్తారో…? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here