ఏడున్నర కోట్లు హాంఫట్…?

కొందరు మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించి ఎలా కోట్లు గడిస్తున్నారో…ధాన్యాన్ని బియ్యం గా మార్చి మార్కెట్ లో వ్యాపారులకు ఎలా విక్రయిస్తున్నారో,సర్కార్ కు సి ఎం ఆర్ పెట్టకుండా ఎలా ఖజానాకు గండి కొడుతున్నారో విజిలెన్స్ దాడులతో తేటతెల్లం ఐయ్యింది… గత కొద్దిరోజుల క్రితం విజిలెన్స్ అధికారులు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం లోని ఓ మిల్లు లో దాడులు నిర్వహించగా ఆ మిల్లు కు పౌర సరఫరాల శాఖ కేటాయించిన ధాన్యం కనిపించలేదు… ఆ ధాన్యం విషయంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీయగా సదరు మిల్లు యజమాని ఆ ధాన్యాన్ని మాయం చేసినట్లు తెలిసింది…దింతో విజిలెన్స్ అధికారులు ఆ మిల్లర్ పై చర్యలు తీసుకోవాలని ఆర్ ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు…అయితే ఇప్పటివరకు జిల్లా అధికారులు ఆ మిల్లర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు… మరోవైపు కమలాపూర్ లోని ఆ మిల్లు యజమాని మిల్లులోని ఎనిమిది వేల బస్తాల ధాన్యం మాయం చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడినట్లు సమాచారం…ఈ ధాన్యం విలువ సుమారు ఏడున్నర కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా…కాగా ఈ ధాన్యాన్ని మిల్లర్ మర ఆడించి పలు రైస్ డిపోలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుంది…ఇదిలావుండగా కేవలం రెండు టన్నుల కెపాసిటీ ఉన్న ఈ మిల్లు కు కొందరు అధికారులు తమ ఇష్టారీతిన ధాన్యం కేటాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి…సి ఎం ఆర్ పెట్టిన పెట్టకపోయిన ఈ మిల్లర్ కు ధాన్యం కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది… ఇలా కేటాయించే విషయంలో ఏ అధికారి సూత్ర దారిగా ఉన్నాడో ఉన్నతాధికారులు కూపీ లాగితే బయటపడే అవకాశముంది…మరోవైపు ఈ మిల్లు రెండు టన్నుల కెపాసిటీ మిల్లు అని అధికారులకు తెలిసినా ఆ మిల్లు యజమాని మాత్రం తన మిల్లు నాలుగు టన్నుల కెపాసిటీ ఉన్న మిల్లు అని కాగితాల్లో చూపడంతో ధాన్యం కేటాయిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు…ఉన్నతాధికారులెవరు తక్కువ కెపాసిటీ ఉన్న ఈ మిల్లు కు ఇన్ని కేటాయింపులు ఎందుకు…?అని ప్రశ్నించకుండా పౌర సరఫరాల శాఖకు సమర్పించే కాగితాల్లో ఆ మిల్లు యజమాని నాలుగు టన్నుల కెపాసిటీ అని పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…కాగా కమలాపూర్ లోని మిల్లు లో విజిలెన్స్ తనిఖీలు జరిగిన మాట వాస్తవమేనని హన్మకొండ జిల్లా పౌర సరఫరాల డి ఎం ఇంచార్జ్ డి ఎస్ ఓ మహేందర్ నిర్థారించారు… తనిఖీల్లో ఆ మిల్లు లోని ధాన్యం మాయమైనట్లు ఆయన ధ్రువీకరించారు…త్వరలోనే చర్యలు ఉంటాయని ఆయన న్యూస్10 కు చెప్పారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here