పంతం నెగ్గించుకున్న అధికార పార్టీ నాయకులు…

అవును శాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  తమ పంతం నెగ్గించుకున్నారు…ఏకంగా మండల తశిల్దార్ నే బదిలీ చేయించడంలో సఫలీకృతులయ్యారని చర్చ సాగుతోంది…తాము చెప్పినట్లు వినడం లేదనో,చెప్పిన పనులు చేయడం లేదనో ఏమో తెలియదు కాని న్యూస్10 ఈ విషయంపై కథనం వెలువడ్డ కొద్దీ రోజులకే తశిల్దార్ ను బదిలీ చేశారు…దింతో అధికార పార్టీలో గల్లి లీడర్ నుంచి మండల స్థాయి నాయకులు అధికారులను ఎలా గుప్పిట్ల్లో పెట్టుకోవాలో…. ఎంత పెద్ద అధికారి ఐయిన గల్లి లీడర్ చెప్పిన ఎమ్మెల్యే ఎలా బదిలీ చేస్తారో స్పష్టం ఐయినట్లు కనపడుతోందని పలువురు కామెంట్ చేస్తున్నారు…తహశీల్దార్ బదిలీ కోసం ఎమ్మెల్యే దగ్గర బాగానే ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఎట్టకేలకు  స్థానిక తహసిల్దార్ కల్వల సత్యనారాయణ ను శాయంపేట నుండి బదిలీ చేయించి పంతం నెగ్గించుకున్నారు. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేదానికి నిదర్శనమే ఈ సంఘటన లా కనపడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, గల్లి నాయకుల మాట తహశీల్దార్ వినడం లేదని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి తాసిల్దార్ పై తప్పుడు సమాచారమిచ్చి బదిలీ చేయించారనే ప్రచారం మండలంలో జోరుగా సాగుతోంది. ప్రజా పాలన ముసుగులో ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గురిచేసి మాట వినకపోతే బదిలీ చేయిస్తే పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందని మండల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అధికారం ఉందని మండలాధ్యక్షుడి ముసుగులో అక్రమ మొరం,ఇసుక దందాకు అనుమతులు ఇవ్వలేదని, కోర్టు కేసులో ఉన్న భూములు, అసైన్డ్ భూములను తన పేరుపై అక్రమంగా పట్టా చేయాలని ప్రభుత్వాధికారులపై పెత్తనం చెలాయిస్తూ కాంగ్రెస్ పార్టీని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ని అబాసుపాలు చేస్తున్నారని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.మండలాధ్యక్షుడి తీరుతో కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here