అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాదేష్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బినగర్లోని తన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఒక స్కూల్ లైసెన్స్ రెన్యువల్ కోసం 60 వేలు లంచం డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు చెప్పారు. వారి నివాసంలో 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటివరకు జరిగిన సోదాల్లో సుమారు 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు.



