అధికారులంటే లెక్కలేదు…!

నివాస ప్రాంతాలు, రైల్వే ట్రాక్ ల పక్కన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ గోడౌన్లు నిర్భయంగా, నిరాటంకంగా నడుపుతున్న కొంతమంది గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలకు అధికారులంటే లెక్కలేనితనంగా మారినట్లు తెలుస్తుంది… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ గోడౌన్లు నడుపుతూ ఎప్పుడో తీసుకున్న అనుమతులతో కొనసాగుతూ వాటినే ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకుంటూ వారు గోడౌన్లు నడుపుతున్న ప్రాంతమలోకాలక్రమేణా జన నివాస ప్రాంతాలు పెరిగిన గోడౌన్ మార్చకుండా అలాగే నిర్వహిస్తున్న కొందరు గ్యాస్ గోడౌన్ల యజమానూలు అధికారుల మాటలను సైతం పెడచెవిన పెడుతూ జిల్లా స్థాయి అధికారి మాట్లాడిన సరిగా స్పందించడం లేదని తెలిసింది…అంతేకాదు నివాస ప్రాంతాలు,రైల్వే ట్రాక్ ల పక్కన గ్యాస్ గౌడౌన్ ల వ్యవహారంపై హన్మకొండ జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ డీలర్లు అందరూ రావాలని ఆదేశించిన వారు ఈ సమావేశానికి రాకుండా వారి దగ్గర పనిచేసే మేనేజర్లు, ఇతర ఉద్యోగులను సమావేశానికి పంపినట్లు సమాచారం…కాగా ఇంకొంతమంది గ్యాస్ డీలర్లు అసలు హాజరు కానట్లు తెలిసింది…దీన్నిబట్టి చూస్తే గ్యాస్ డీలర్లకు అధికారులంటే ఎంతటి లెక్కలేనితనమో అర్థం అవుతుంది… ప్రభుత్వ నిబంధనలు కాదని గోడౌన్లు నిర్వహిస్తున్న ఈ గ్యాస్ ఏజెన్సీల యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో అధికారులు ఆలోచించాలి… ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి గ్యాస్ గోడౌన్లు నిర్వహిస్తున్నారని ఇది ప్రజల భద్రత కు ముప్పు అని వార్త కథనాలు వెలువరిస్తే న్యూస్10 అంతు చూస్తాం… ఆ పత్రిక ఏ సామాజిక వర్గానికి చెందిన వారిది అని ఆరా తీసే గ్యాస్ ఏజెన్సీల యజమానులు అనవసరవు ఆరా లు మాని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే మంచిదే కదా…అధికారులంటే ఏమాత్రం లెక్కలేని వీరి పట్ల ఎందుకు సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లో వారికే తెలియాలి…అంతేకాదు గత దశాబ్దన్నర కాలంగా గ్యాస్ ఏజెన్సీలతో అధికారులు ఎలాంటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించకుండా వారి ఇష్టానికి వారిని వదిలేయడం వల్ల గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలు మాకు చెప్పేవారు ఎవరు ….? అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి…మరి వీటన్నింటికి అధికారులు ఎలా చెక్ పెడతారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here