ఎంజీఎం లో ఆగని బిల్లుల ప్రయత్నాలు..?

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికారుల అండదండలతో బిల్లులు ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న ఎంజీఎం కాంట్రాక్టర్ తన బిల్లు ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది… ఎంజీఎంలో కాంట్రాక్టర్ బిల్లుల వ్యవహారంలో న్యూస్ 10 గత కొద్ది రోజుల క్రితం కొన్ని కథనాలను వెలువరించగా, బిల్లులను నిలిపివేసిన అధికారులు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించాల్సి నా ఫైలు బూజు దులిపి, మళ్లీ బిల్లులు మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది… నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన, మస్టర్స్ లేకున్నా, సరిపడా సిబ్బంది లేకున్నా, గత కొన్ని సంవత్సరాలుగా అడ్డగోలుగా సర్కారు సొమ్మును దోచిపెడుతూ బిల్లులు చేస్తున్న అధికారులు మళ్లీ అదే విధానాన్ని అనుసరిస్తూ బిల్లులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.. ఎంజీఎంలో కాంట్రాక్టు నిర్వహిస్తున్న ఆ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లింపును ఎవరు వ్యతిరేకించడం లేదు కానీ.. ఆ కాంట్రాక్టర్ అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడాన్ని కొందరు తప్పు పడుతున్నారు.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల బిల్లులు దండుకుంటున్న ఆ కాంట్రాక్టర్ కు అధికారులు ఎందుకు సహకరిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు… సిబ్బంది, మస్టర్స్ విషయంలో విచారణ జరిపి ఎందుకు ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోరనే పలు రకాల ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి.. కాగా ఆ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించేందుకు గతంలో 96 శాతం సాటిస్ ఫ్యాక్టరీ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు ఏ పద్ధతిన ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు సాటిస్ ఫ్యాక్టరీ ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి… కాగా న్యూస్10 తన కథనాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఖంగుతిన్న అధికారులు ఇప్పుడు ఆ సాటిస్ ఫ్యాక్టరీని 50 శాతానికి తగ్గించినట్లు తెలియ వచ్చింది… మరి గతంలో 96% సాటిస్ ఫ్యాక్టరీ ఇచ్చిన అధికారులు ఇప్పుడెందుకు అంతగా తగ్గించారో వారికే తెలియాలి.. ఎంజీఎంలో కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించేందుకు చక చక ఫైళ్ళపై సంతకాలు చేసి, ఉన్నతాధికారులకు పంపి బిల్లులు క్లియర్ చేసి కాంట్రాక్టర్ పై తమకున్న భక్తి శ్రద్దలను చాటుకునేందుకు సిద్ధమైన అధికారులు, కాంట్రాక్టర్ ను మస్టర్స్, పూర్తి సిబ్బంది వివరాలను సమర్పించమని ఎందుకు అడగడం లేదో వారికే తెలియాలి.. దాదాపు రెండు సంవత్సరాలుగా కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేసిన ఎంజీఎం అధికారులు మస్టర్స్ , సరిపడా సిబ్బంది లేకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎందుకు ఆ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించారో…? వారే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది… ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారంపై కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ విచారణ చేయిస్తే ఈ బిల్లుల బాగోతం మొత్తంగా బట్టబయలయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.. అరకొర సిబ్బంది , అసలే లేని మస్టర్స్ తో కాంట్రాక్టర్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా తీసుకుపోతుంటే అందుకు అధికారులు తమ శాయశక్తుల సహకారం అందించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది… ఇప్పటికైనా ఈ విషయంపై అధికారులు స్పందించి తీగలాగితే డొంక కదిలే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here