ఆరు నూరైనా నూరు ఆరైనా ఎలాగైనా బిల్లులు ఇప్పిస్తాం.. అవకతవకలకు పాల్పడిన ,నిబంధన ఉల్లంఘించిన, సరిపడా సిబ్బందిని నియమించకపోయినా, ఎం ఓ యు కు తూట్లు పొడిచిన బిల్లులు ఇప్పించి తీరుతాం.. అంటూ ఎంజీఎం సూపరింటెండెంట్ ఆ కాంట్రాక్టర్ ముందు శపథం చేసినట్లు కనబడుతోంది.. కాంట్రాక్టర్ కు బిల్లులు ఇప్పించేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ స్వయంగా ఫైల్స్ పట్టుకొని సూపరింటెండెంట్ తిరుగుతున్నట్లు సమాచారం.. ఎంజీఎంలో కాంట్రాక్టర్ నియమించాల్సిన సిబ్బంది విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సరిపడా సిబ్బందిని నియమించకున్న బిల్లులు మాత్రం సర్కార్ చెప్పినట్లే సిబ్బందిని నియమించానని తీసుకోవడం మస్టర్స్ సమర్పించకుండానే వందకు దరిదాపుల్లో సాటిస్ ఫ్యాక్టరీ సర్టిఫికెట్ తీసుకోవడం …ఇంత జరుగుతున్న ఎంజీఎం సూపరింటెండెంట్ తో సహా అధికారులు ఎవరికీ చీమకుట్టినట్టైనా లేదు.. కళ్ళముందు కాంట్రాక్టర్ కు నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల సర్కారు సొమ్ము తరలిపోతున్న అధికారులు ఎవరూ ఏమాత్రం తమకు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు… గత కొద్ది రోజులుగా కాంట్రాక్టర్ వ్యవహార శైలిపై నిబంధనల ఉల్లంఘన పై న్యూస్ 10 పలు కథనాలను వెలువరిస్తుండగా, కాంట్రాక్టర్ పై అధికారులు విచారణకు ఆదేశించకుండా సదరు కాంట్రాక్టర్ కు బిల్లులిప్పిస్తానని ఎంజీఎం సూపరింటెండెంట్ వాగ్దానం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.. తాను ఇప్పించి తీరుతానని చేసిన శపథం,వాగ్దానం ప్రకారం బిల్లులు ఇప్పించడానికి కలెక్టర్ కు ఇప్పటికే నోట్ పైల్ పంపి సంతకం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఎంజీఎం సూపరింటెండెంట్ ప్రదక్షిణలు చేస్తున్నట్లు ఎంజీఎం ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది… ఓ కాంట్రాక్టర్ కు బిల్లులు ఇప్పించేందుకు ఎంజీఎం సూపరింటెండెంట్ ఇంతటి ఆసక్తిని ఎందుకు కనబరుస్తున్నారో, అసలు విషయాలు కలెక్టర్ వివరించకుండా నోట్ ఫైల్ పెట్టి బిల్లు మంజూరు చేసేందుకు ఎందుకు తాపత్రయపడుతున్నారో…? వారికే తెలియాలి.. కాగా కాంట్రాక్టర్ కు పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కాంట్రాక్టర్ కు మధ్య ఎదో ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది ..బిల్లులు ఇప్పిస్తే భారీ స్థాయిలో ప్రసన్నం చేసుకుంటానని కాంట్రాక్టర్ సూపరింటెండెంట్ ఇతర ఎంజీఎం అధికారులకు మాట ఇచ్చినట్లు ఆ నోట ఈ నోట బాగానే ప్రచారం సాగుతోంది… అందుకే ఎంజీఎం సూపరింటెండెంట్ నోట్ ఫైల్ పెట్టడమే కాకుండా ఫైల్ తొందరగా క్లియర్ అయ్యేలా తానే స్వయంగా శ్రద్ధ పెట్టి మరి పని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ..ఎంజీఎంలో పాలన విభాగాన్ని గాలికి వదిలేసి, అక్కడ సమస్యలు, ఇతర వ్యవహారాలను చక్కబెట్టకుండా కేవలం కాంట్రాక్టర్ కు బిల్లులు ఇప్పించేందుకు ఎంజీఎం సూపరింటెండెంట్ తనకు వేరే పని ఏమీ లేనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.. అంతేకాదు బిల్లుల విషయంలో జిల్లా కలెక్టర్ కు ఏవో విషయాలు చెప్పి ఎలాగైనా కాంట్రాక్టర్ కు బిల్లులు ఇప్పించాలని సూపరింటెండెంట్, ఆర్ఎమ్ఓ ,సెక్షన్ క్లర్క్ తదితర అధికారులు కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది.. అయితే ఇంతలా కష్టపడి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ కు బిల్లులు ఇప్పిస్తే ఈ ఎంజీఎం అధికారులకు ఏమేరా లబ్ధి చేకూరనుందో…? వారే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ..అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తూ కాంట్రాక్టర్ నిబంధనలను ఉల్లంఘించిన బిల్లులు మంజూరి చేయడానికి అధికారులు మొగ్గు చూపుతున్నారంటే ప్రజా ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ ప్రయోజనాలు వీరికి ముఖ్యమని స్పష్టమవుతుంది…
ఈ ప్రశ్నలకు బదులేది…?
కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు చేసేందుకు తెగ ఉబలాటపడుతున్న ఎంజీఎం అధికారులు పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ..కలెక్టర్ సైతం ఆరా తీయాల్సి ఉంది ..అసలు ఎంజీఎం లో ఎం ఓ యు నిబంధనల ప్రకారం సుమారు 680 మంది కార్మికులు ఉండాలి కానీ కాంట్రాక్టర్ ఎంతమంది కార్మికులను నియమించారు…? స్పష్టం చేయాల్సి ఉంది .. అలాగే కార్మికుల హాజరు పట్టి ఎక్కడ ఉందో ఆ మస్టర్స్ అధికారులకు సమర్పిస్తున్నారా లేదా? అవి ఎక్కడ ఉన్నాయి..? ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో కాంట్రాక్ట్ నిర్వహిస్తున్నఏజెన్సీ లో ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారు….?ఎంత మంది కార్మికులు ఉన్నారని ఎంజీఎం అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారున్నారు….?
కాంట్రాక్టర్ కార్మికులకు చెల్లిస్తున్న జీతాలు ఎంత.. ? కాంట్రాక్టర్ తన ఆధీనంలో పనిచేస్తున్న కార్మికులకు చెల్లిస్తున్న ఈఎస్ఐ, పి ఎఫ్ ఎంత…?ఈ ప్రశ్నలకు ఎంజీఎం అధికారులు సమాధానం చెప్పకుండా బిల్లుల మంజూరికి శపథం చేయడం వారికే చెల్లింది…
కలెక్టర్ ఎలా స్పందిస్తారో….?
కాంట్రాక్టర్ పై ఆరోపణలు ఎన్ని ఉన్నా ,నిబంధనలకు తూట్లు పొడిచిన, బిల్లులు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్న ఎంజీఎం అధికారుల పట్ల , వారు పంపిన నోట్ ఫైల్ విషయంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారనేది..? ప్రస్తుతం ఎంజీఎంలో చర్చనియాంశంగా మారింది… కాంట్రాక్టర్ చెందిన మనుషులు ,ఎంజీఎం అధికారులు సూపరింటెండెంట్ తో సహా అందరూ వరంగల్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఎలాగైనా బిల్లులు మంజూరు చేసుకోవాలని చూస్తుండడం పట్ల కలెక్టర్ ఎలా స్పందిస్తారని ఎంజీఎంలో చర్చ జరుగుతోంది ..గతంలో ఈ కాంట్రాక్టర్ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ ఇప్పుడు బిల్లులు మంజూరు చేస్తారా…? లేక విచారణకు ఆదేశిస్తారా? అనేది ప్రశ్న గా మారింది.. ఎలాగైనా బిల్లులు ఇప్పించాలని ఎంజియం అధికారులు కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.. మరి ఈ విషయంలో కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది…



