రాత్రిపూట బిల్లుల మంజూరికి అంతా సిద్ధం

రాత్రి పూట బిల్లులు ఇచ్చేందుకు అంత సిద్ధం చేశారట…ఎంజీఎం కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరి చేసేందుకు ఎంజిఎం ఇంచార్జ్ సూపరింటెండెంట్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది… బిల్లులపై సంతకాలు చేయించుకొని బిల్లులు తీసుకునేందుకు ఎంజిఎం కాంట్రాక్టర్ కు చెందిన కొంతమంది ప్రతినిధులు రాత్రిపూట ఎంజీఎం లో ఇంచార్జ్ సూపరింటెండెంట్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది… ఆరోపణలు ఎన్ని ఉన్నా కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా ఎంజీఎం ఇంచార్జ్ సూపరింటెండెంట్ మాత్రం కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరి చేసి లబ్ది చేకూర్చలని చూస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి…కాగా బిల్లుల మంజూరి విషయంలో ఇంచార్జ్ సూపరింటెండెంట్ ఎందుకు ఇంతటి అత్యుత్సాహం చూపుతున్నారో దీనివేనక ఎలాంటి మతలబు ఉందొ అనే అనుమానాలు కలుగుతున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here