అధికారులదే వసూళ్ల దందా…?

అక్కడ అధికారులు శాసిస్తారు …ఏజెంట్లు పాటిస్తారు…ఎజెంట్లే కాదు కొందరు బ్రోకర్లు,హోమ్ గార్డ్ లు సైతం అదే పనిలో ఉంటారు….అక్కడి అధికారులు చెప్పింది చెప్పినట్లుగా వింటూ అధికారుల అక్రమ వసూళ్ల దందాకు శాయశక్తులా సహకరిస్తున్నారు…వాహనదారులను కింద మీద పడి ఒప్పించి అందినకాడికి దండుకొని దండుకున్న దానిలో అధికారులకు సింహ భాగం అప్పగించి మిగతాది తమ జేబులో కుక్కుకొని అవినీతి కథ నడిపిస్తున్నారు…. పనికో రేటు ఫిక్స్ చేసి ఇలాగైతేనే చేస్తాం అంటారు కాదు కూడదు అన్నారు అనుకో అక్కడ అధికారి కొర్రీ పెట్టి పని కాకుండా అధికారే అడ్డుపుల్ల వేస్తాడు…వెళ్ళండి వెళ్లి మా ఏజెంట్ నో బ్రోకర్ నో సంప్రదించండి అన్నట్లు చెప్పిచెప్పకనే పరోక్ష సంకేతాలు ఇస్తారు…ఇంకేముంది చేసేదేమీ లేక ఆ వాహనదారు చెప్పింది ముట్టజెప్పి పని చేసుకొని వెళ్లి పోతారు….ఇది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న నిత్య అవినీతి తంతు…ఓ పక్క టాస్క్ ఫోర్స్ దాడులు జరుగుతున్న,అధికారులు ఎసిబి కి పట్టు బడుతున్న ఎలాంటి భయం లేకుండా నడుపుతున్న బరితెగింపు అవినీతి భాగోతం ఇది ఆ పక్క జిల్లాలో జరిగింది.. మనవరకు వచ్చేవరకు చూద్దాం లే అని అవినీతికి పాల్పడుతూ వసూళ్ల దందాకు అక్కడి అధికారులు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది…ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తూ భారీగానే వారు వెనకేస్తున్నారు… ఎజెంట్లను మధ్యవర్తులుగా పెట్టి ఒక్కో అధికారి వారికి సంబంధించిన వ్యక్తిని వసూళ్ల మధ్యవర్తిగా పెట్టుకొని దందా కానిచ్చేస్తున్నారు….ఇక్కడ ఉన్న ఏజెంట్లు హోమ్ గార్డులు రవాణా శాఖ కార్యాలయం చుట్టూ ఉన్న కిరాణం షాపులు,టి కొట్టు లో డబ్బులు ఇచ్చేలా వాటిని వసూళ్ల కేంద్రాలుగా మార్చి డబ్బులు అక్కడే ఇవ్వాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు…..


జోరుగా వసూళ్ల దందా….

మానుకోట ఆర్టీఏ ఆఫీసులో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. వివిధ అవసరాల కోసం వచ్చే వాహనదారుల నుండి ఏజెంట్లు,అధికారులు,హోమ్ గార్డులు సిండికేట్ గా మారి విచ్చలవిడిగా వసూళ్లకు తెగబడి సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు.ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు ఆన్లైన్ ద్వారా చెల్లించినప్పటికి ఆఫీసులో అడుగుపెట్టగానే అధికారులకు ,ఏజెంట్లకు, హోమ్ గార్డులకు అదనపు చెల్లింపులు తప్పడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎజెంట్లను కాదని సొంతంగా పని పూర్తి చేసుకుందామనుకొని ఆఫీసుకి వెళ్తే అధికారులు ఇది లేదు అది లేదు అంటూ నానా రకాల కొర్రీలు పెడుతూ వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తు వారి దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తారు. ఏజెంట్ ను కలిసి వారికి వారికి కావాల్సింది ముట్టజెప్పితే అంతే ఎలాంటి పని అయినా అది ఎంత అక్రమమైనా సక్రమం అయిపోతుంది.ఆఫీసు ఓపెన్ చేయగానే అధికారుల కంటే ముందుగానే అక్కడికి చేరుకున్న ఏజెంట్లు,హోమ్ గార్డులు తమ వసూళ్ల పర్వాన్ని మొదలుపెట్టి అధికారులు వచ్చే సమయానికల్లా అంతా రెడీ అన్నట్లు అక్కడి వాతావరణాన్ని సెట్ చేసి తమ దందాను మొదలెడుతున్నారు.ఇక అధికారులు వచ్చి జేబులు నింపుకోవడమే లేటు ఆ తర్వాత వాటాల లెక్కన కమిషన్లు పంచుకోవడమే తరువాయి అన్నట్లు అక్కడి వ్యవహారం కొనసాగుతుంది.అంతే కాకుండా ఆఫీసుతో ముడిపడి ఉన్న ప్రతి పనికి ప్రభుత్వానికి చెల్లించే రేటుతో పాటు అధికారులకు,ఏజెంట్లకు మధ్య కమిషన్ కొరకు ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ బహిరంగంగా వసూలు చేస్తున్నారు ..ఆర్టీఏ ఏజెంట్లు,హోమ్ గార్డులు.స్లాట్ బుకింగ్ మొదలు పని పూర్తి అయ్యే వరకు అన్ని దశల్లో ఒక్కో రేటు కమిషన్ చెల్లించి వాహనదారులు మోసపోతుంటే అధికారులు మాత్రం వారి ఎజెంట్లను మధ్య వర్తులుగా నియమించుకొని వారి జేబులు నింపుకుంటున్నారు.అంతే కాకుండా దోచుకున్న సొమ్మును అధికారులు తమ తమ స్థాయిలను బట్టి పంచుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహరమంతా ఆర్టీఏ ఆఫీసుల్లో పెద్ద సార్లుగా చెప్పుకొనే డీ టీ ఓ, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని విమర్శలు వస్తుండడం కొసమెరుపు.

అధికారులదే వసూళ్ల దందా...?- news10.app
డబ్బులు ఎక్కడ ఇవ్వాలో చెబుతున్న హోమ్ గార్డ్
అధికారులదే వసూళ్ల దందా...?- news10.app
టి కొట్టులో డబ్బులు చెల్లిస్తున్న వాహన దారుడు
అధికారులదే వసూళ్ల దందా...?- news10.app
అధికారులదే వసూళ్ల దందా...?- news10.app
అధికారులదే వసూళ్ల దందా...?- news10.app
ఇలా డబ్బులు పుచ్చుకున్నాడు…
అధికారులదే వసూళ్ల దందా...?- news10.app

ఇలా పని కానిచ్చేసాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here