హనుమకొండ జిల్లాలోని అవని కళాశాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కళాశాల అనుమతితో రెండు వేర్వేరు ప్రాంతాల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ చోట అనుమతి పొందిన సంస్థ, ఓ చోట మరో క్యాంపస్ ఏర్పాటు చేసి వందకు పైగా విద్యార్థులతో అనుమతులు లేకుండానే కళాశాల నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా విద్యాసంస్థ నిర్వహణకు ఎవరి అండ ఉంది? నిబంధనలు ఉల్లంఘించినా యాజమాన్యంపై చర్యలు ఎందుకు లేవు? “అనుమతులు ఏవి అవని..?” అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేని అవని కళాశాల వ్యవహారం పై న్యూస్10 విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో…



