- హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశం
- ఆ స్థానంలో తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని సీఎస్‌కు సూచన
- కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ సందర్భంగా కీలక ఉత్తర్వులు
తెలంగాణ హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన పలు కేసుల విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించి, ఆ స్థానంలో తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను హైకోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల అమలు విషయంలో నిర్లక్ష్యం, కోర్టు ధిక్కరణ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఆదేశాలతో హైడ్రా వ్యవహారం రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.



