- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న బీఆర్ఎస్ అధినేత
- మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి చేరుకోనున్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి రానున్నారు. ఇటీవల చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు యశోద ఆస్పత్రికి చేరుకోనున్న కేసీఆర్, కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ వెంట ఉండే అవకాశం ఉంది.


