ఆ ఉద్యోగులపై చర్యలు ఉండవా…?

వరంగల్ ఎంజీఎం లో నిత్యం డుమ్మాలు కొడుతూ విధులకు ఎగనామం పెడుతున్న ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి ఎంజీఎం అధికారులు ఎందుకో వెనుకడుగు వేస్తున్నారు…విధులకు హాజరు కాకుండా తమ కొలువులను కాపాడుకోవడం కోసం ఎంజీఎం పాలన విభాగం లోని అటెండెన్స్ రిజిస్టర్ ను సైతం ఖాళీ గడులతో వారికి అనుకూలంగా మార్చుకున్న వీరిపై అన్ని ఆధారాలు ఉన్నా ఎంజీఎం సూపరింటెండెంట్, పాలన విభాగం ఎడి వారినే వెనకేసుకొస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ఈ ఇద్దరు ఉద్యోగుల తీరుపై అదిగో విచారణ,ఇదిగో విచారణ,…విచారణ ముగిసింది విచారణ నివేదిక సిద్ధం అని మాటలు చెప్పిన అధికారులు ఆ విచారణ నివేదికను పాలన విభాగం లోని బీరువాకు ప్రయత్నం చేశారు తప్ప ఆ నివేదిక ఆధారంగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు…ఎంజీఎం లోని అధికారులు సీనియర్, జూనియర్ అసిస్టెంట్ లకే తమ శాయశక్తులా సహకరిస్తూ…చర్యలు తీసుకోవడం లేదు కనుక వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు…ఎంజీఎం లో ఆ ఇద్దరు ఉద్యోగుల వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకుంటే ఎంజీఎం పాలన విభాగం ఓ గాడిన పడుతుందని అక్కడి ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది… ఇదిలాఉంటే విధులకు డుమ్మాలు కొడుతూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు ఉద్యోగులు ఓ ఎమ్మెల్యే పేరుతో బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది…తమపై వార్త కథనాలు రాసేవారికి ఎమ్మెల్యే తో ఫోన్ చేయిస్తామని ఎంజీఎం లో గొప్పలు చెప్పుకుంటు ఆ ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు చెపుతున్నారు…తమను ఏ అధికారి ఏమి చేయలేడని అంత ఆ ఎమ్మెల్యే చూసుకుంటాడని వారు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది… ఏదిఏమైనా వీరిద్దరి ఎగనామాల విషయంలో కలెక్టర్ దృష్టి సారిస్తార… ఆ ఉద్యోగులపై చర్యలకు ఆదేశిస్తార…? చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here