రెజోనెన్స్ విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది…అర కొర వసతులు ,బిల్డింగ్ ఖాళీ గా కనపడితే చాలు కళాశాల బోర్డ్ పెట్టిసి అడ్మిషన్లు చేసి విద్యార్థులను లోపలికి పంపించడమే…అనుమతుల మాట తర్వాత భవనం చూసామ…?అడ్మిషన్లు చేశామ…?లేదా అనేది ముందు వారికి కావాల్సింది…హన్మకొండ నగరంలో ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్ ల పేరుతో ప్రారంభం చేసి అడ్డగోలు పీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబుకు కత్తెర పెడుతున్నారు…తప్పుడు ర్యాంకుల వివరాల చెబుతూ అలా చేస్తాం..ఇలా చేస్తాం అని నమ్మబలుకుతూ లక్షల్లో పీజులు దండుకుంటున్నట్లు రిజోనెన్స్ కళాశాలపై ఆరోపణలు ఉన్నాయి…త్రినగరిలో అనుమతులు లేకున్నా బ్రాంచ్ లు నిర్వహిస్తూ పట్టుకోండి చూద్దాం అంటూ రిజోనెన్స్ యాజమాన్యం విద్యాశాఖకే సవాల్ విసురుతోంది..
.త్రినగరిలో కార్పొరేట్ విద్యా మాఫియా రెచ్చిపోతుంది.
కాసుల కోసం కక్కుర్తి పడి పేద,ధనిక భేదం లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకుంటుంది.ఉన్నత చదువులు చదివించాలని నాణ్యతమైన ,ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కలలుకనే తల్లిదండ్రుల యొక్క ఆశలనే పెట్టుబడిగా చేసుకొని కార్పొరేట్ విద్యా వ్యాపారులు పుట్టగొడుగుల్లా కళాశాలలు స్థాపిస్తూ అడ్డగోలుగా అడ్మిషన్లు చేసుకుంటూ లక్షల్లో ఫీజులు గుంజుతూ వారిని ఆర్ధికంగా దగా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.సరిగ్గా ఇదే కోవాకు చెందింది హన్మకొండ నగరంలోని రేజోనెన్స్ విద్యా సంస్థల యాజమాన్యం నగరంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా అడ్డగోలుగా కళాశాల బ్రాంచీలు ఏర్పాటు చేసి బాయ్స్, గర్ల్స్ క్యాంపస్లు వేర్వేరు అంటూ విద్యా సంస్థలు స్థాపించి వారి నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంది.నీట్,ఐఐటి, జేఈఈ కోచింగ్ ల పేర అదనంగా ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మోయలేని ఆర్థిక భారాన్ని వేస్తుంది.తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తూ అడ్డగోలుగా అడ్మిషన్లు చేర్చుకుంటు విద్యార్థులకు హాస్టళ్లలో అరకొర వసతులు కల్పిస్తూ వారిని ఫీజుల పేర వేధింపులకు గురి చేస్తుంది.అంతే కాకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలో కళాశాలల్లో కనిపించిన సౌకర్యాలు చివర్లో కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.అంతే కాకుండా విద్యార్థులకు నగరంలో ఏసీ, నాన్ ఏసీ క్యాంపస్ లు అంటూ తల్లిదండ్రులను చల్లగా దోచుకుంటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కళాశాల యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.నగరంలో ఏ మూలన ఓ భవనం అద్దెకు దొరికినా కళాశాల పేరుతో ఓ బోర్డు పాతి విద్యా వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా కొనసాగిస్తూ రెండు చేతులా సొమ్ము చేసుకోవడం కార్పొరేట్ విద్యా మాఫియాకు అలవాటైపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే లక్ష్యంగా కళాశాలల్లో అడ్మిషన్ల కొరకు ప్రయివేటు గా పీ ఆర్ ఓ లను నియమించుకొని వారికి అడ్మిషన్ల చొప్పున కమిషన్లు అందజేస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు,తప్పుడు ర్యాంకులతో ప్రచారం చేస్తూ బుట్టలో వేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే పీ ఆర్ ఓ మాయమాటలు నమ్మి కలశాలల్లో చేరిన విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కళాశాలల్లో చేర్పించిన పీ ఆర్ ఓ లో కానరాక తల్లిదండ్రులు ఇబ్బందులు పడిన సందర్బాలు లేకపోలేవు.రేజోనెన్స్ భారీ హోర్డింగులు ,రంగు రంగుల కరపత్రాలు తప్పుడు ర్యాంకులు చూపి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను బుట్టలో వేసుకొని ఆ తర్వాత వారికి ఫీజుల పేరుతో పట్టపగలే చుక్కలు చూపించడం కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలకు వెన్నతో పెట్టిన విద్య….తల్లితండ్రులారా తస్మాత్ జాగ్రత్త….


