ఆ పౌల్ట్రీ ఫాం బాలకార్మికులకు అడ్డా గా మారినట్లు తెలుస్తుంది… లక్షలు గడిస్తున్న ఆ లేయర్ పౌల్ట్రీ ఫామ్ లో సరైన సిబ్బందిని నియమించుకునేందుకు ఆ పౌల్ట్రీ ఫార్మ్ యజమాని ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.. పౌల్ట్రీ ఫామ్ లో అధిక సంఖ్యలో బాల కార్మికులను పనిలో పెట్టుకుని అర కొర జీతాలతో పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మైనార్టీ తీరని వారిచేత పౌల్ట్రీ ఫాం పనులు చేయిస్తూ ఆ యజమాని తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు బాగానే వినిపిస్తున్నాయి.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు సమీపంలో గల ఈ పౌల్ట్రీ ఫామ్ లో బాల కార్మికులు పనిచేస్తున్న కార్మిక శాఖ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహ రిస్తున్నట్లు తెలుస్తోంది.. పరకాల డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఈ పౌల్ట్రీ ఫార్మ్ యజమానితో స్నేహంగా మెలుగుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విశ్వసినీయంగా తెలిసింది. ఈ లేయర్ పౌల్ట్రీ ఫామ్ లో బాల కార్మికుల ఉన్న విషయం ఈ అధికారికి తెలిసిన చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలిసింది…ఫోన్లో పౌల్ట్రీ ఫార్మ్ యజమానిని సంప్రదించి ఆ ఫామ్ లో బాల కార్మికులు లేరనే విషయం తనకు తానే అధికారి రూడి చేసుకున్నట్లు తెలియ వచ్చింది.. ఇలా ఈ లేబర్ అధికారి పౌల్ట్రీ ఫార్మ్ యజమానికి సహకరిస్తుండడంతో ఆ యజమాని తాను ఆడింది ఆటగా, పాడింది పాటగా భావిస్తూ బాల కార్మికుల చేత పనిచేస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే తన పౌల్ట్రీ ఫామ్ లో బాల కార్మికుల చేత పనిచేస్తున్న ఆ పౌల్ట్రీ యజమాని ఫామ్ లోకి అధికారులతో సహా మీడియా మరి ఎవరు ప్రవేశించకుండా ప్రధాన గేటు వద్దే కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ ఒకవేళ ఎవరైనా తనిఖీ కోసం,ఆరా తీయడం కోసం వస్తే సీసీ కెమెరాల్లో గమనించి ఫామ్ లో పనిచేస్తున్న బాల కార్మికులను ఎవరి కంటపడకుండా వేరే ప్రదేశానికి తరలిస్తున్నట్లు విశ్వసినీయంగా తెలియ వచ్చింది . ఇటీవలే తన ఫామ్ ఎదుట మా పౌల్ట్రీ ఫామ్ లో బాల కార్మికులు లేరు. అని నామమాత్రంగా ఓ బోర్డు తగిలించిన యజమాని ఈ పౌల్ట్రీ లో మాత్రం మొత్తం పని బాల కార్మికుల చేతనే చేయిస్తున్నట్లు పలువురు అంటున్నారు..
బీహార్ టు తెలంగాణ…
బీహార్ రాష్ట్రం నుంచి కొత్తగట్టులోని పౌల్ట్రీ ఫామ్ లో పని చేయడం కోసం బాల కార్మికులను తీసుకువస్తున్నట్లు తెలిసింది.. సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగీలా అనే టేకేదార్ ఈ పౌల్ట్రీ యజమానికి బాల కార్మికులను సమకూరుస్తున్నట్లు సమాచారం. తక్కువ జీతాలతో బాల కార్మికులు పనిచేస్తుండడంతో మరిన్ని లాభాలు ఆర్జించడం కోసం పౌల్ట్రీ యజమాని బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లు తెలిసింది.. వీరికి కనీస రక్షణా చర్యలు చేపట్టకుండా,ఫామ్ లో పనిచేయడానికి కావలసిన కావలసిన గ్లౌజులు, మాస్కులు కూడా సప్లై చేయకుండా బాల కార్మికులచే పనిచేస్తున్నట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది.. ఫామ్ కి సమీపంలోనే వీరికి నివాసం ఏర్పాటు చేసి అత్యధిక పనిగంటలు వీరి చేత పనిచేయిస్తూ పౌల్ట్రీ యజమాని వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.. ఇతగాడికి బాల కార్మికులను అప్పగిస్తున్న రంగీలా సైతం అన్ని విధాల సహకరిస్తూ అడిగినప్పుడల్లా బాల కార్మికులను తీసుకువస్తున్నట్లు తెలిసింది.. ఈ రంగీలా టేకేదార్ తెలంగాణ వ్యాప్తంగా పౌల్ట్రీ ఫార్ములకు బాల కార్మికులను చేరవేస్తున్నట్లు తెలిసింది.. ఇది ఇలా ఉంటే కొత్తగట్టు పౌల్ట్రీ ఫామ్ లో బాల కార్మికులు ఉన్న విషయాన్ని మీడియా దృష్టికి వెళ్లిందని పౌల్ట్రీ ఫార్మ్ యజమాని లేబర్ అధికారి దృష్టికి తీసుకువెళ్లగా బాల కార్మికులు ఉన్నారని మీడియా ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెట్టమని సదరు అధికారి పౌల్ట్రీ యజమానికి ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది.. ఈ పౌల్ట్రీ ఫామ్ లో బాల కార్మికులు ఉన్నారని అధికారులకు సమాచారం అందగా వారు తనిఖీ చేసే లోపే బాల కార్మికులను ఇక్కడ నుంచి వేరే చోటుకు వారిని తరలిస్తూ చాలా తెలివిగా పౌల్ట్రీ ఫార్మ్ యజమాని పలుమార్లు తప్పించుకున్నట్లు తెలియ వచ్చింది.. అలాగే ఈ విషయంలో స్థానిక నేతలు కొందరు పౌల్ట్రీ యజమాని నిలదీస్తే వారితో డీల్ సెట్ చేసుకొని వారికి లకారాల రూపంలో నగదు అందజేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలియ వచ్చింది . ఇప్పటికే ఆ నగదును స్థానిక నాయకులకు అందజేసినట్లు సమాచారం. కాగ కొత్తగట్టు లేయర్ పౌల్ట్రీ ఫామ్ లో ఇంత జరుగుతున్న అధికారులు మౌనం వహిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఇకనైనా ఈ పౌల్ట్రీ ఫామ్ లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బాల కార్మికులకు పని భారం నుంచి విముక్తి కలిగిస్తారా లేదా…? వేచి చూడాలి..




