హన్మకొండ జిల్లా కొత్తగట్టు సమీపంలో ఉన్న లేయర్ ఫాం పై అధికారులు ఎక్కడలేని ప్రేమ కనబరుచుతున్నట్లు తెలుస్తుంది.. అందుకే బాల కార్మికులు ఉన్న తమను ఎవరు ఏమి చేయలేరని.. అధికారులు తనిఖీ వస్తున్న సమయంలో వారి కంట పడకుండా బాల కార్మికులను ఎక్కడకు తరలించాలో తమకు బాగా తెలుసనీ పౌల్ట్రీ యజమాని ఎక్కడ లేని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది…కార్మిక శాఖ అధికారులు తనకు అన్ని విధాల సహకరిస్తుండడం వల్ల ఆ పౌల్ట్రీ యజమాని తాను ఎం చేసిన అడిగే వారు లేరని పూర్తి ధీమాతో ఉన్నట్లు తెలుస్తుంది.. దీనికి తోడు కొందరు తెలంగాణకు చెందిన వ్యక్తులు ఈ యజమాని తో అన్ని విధాల లబ్ది పొందుతూ అన్ని మేం చూసుకుంటాం ఏదైనా చేయండి మీకు అడ్డు ఉండదు అని ధైర్యం చెబుతూ అతడి అక్రమ పనులను సక్రమం చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది… ఈ పౌల్ట్రీ యజమాని ఏ తప్పు పనిచేసిన ఎవరైనా ఇదేంటి…? అని ప్రశ్నిస్తే చాలు వారు ఎక్కడ ఉన్న వాలిపోయి ప్రశ్నించే వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది… ఇందుకు ప్రతిఫలంగా ఆ పౌల్ట్రీ యజమాని వారికి కొన్ని వ్యాపారాలు లీజుకు ఇచ్చినట్లు సమాచారం… గతంలో ఈ యజమాని తో వైరం కొనసాగించిన వీరు ఇప్పుడు అన్ని విధాల సహకరిస్తున్నట్లు తెలుస్తుంది…
అధికారుల నిర్లక్ష్యం…?
కొత్తగట్టు లేయర్ పౌల్ట్రీ ఫాం గుట్టు ఒక్కొకటిగా బయటపడుతున్న ఆ పౌల్ట్రీ యజమాని మాత్రం బాల కార్మికుల వ్యవహారం లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మొన్నటికి మొన్న కొందరు బాల కార్మికులను గుడ్లు ఏరడం కోసం బీహార్ నుంచి రప్పించినట్లు విశ్వసనీయ సమాచారం.. గుట్టు బయటపడ్డ బాలకార్మికులు కనపడకుండా ఎలా వ్యవహారిస్తున్నారో తేటతెల్లం అయినా ఇంకా బాలకార్మికులను రప్పించారు అంటే ఆ పౌల్ట్రీ యజమానికి ఎందుకంత దైర్యం.. ఎక్కడిది ఆ దైర్యం అని చర్చ సాగుతుంది… ఆంధ్రా నుంచి వచ్చిన ఆ యజమాని తెలంగాణ కు చెందిన కొందరు వ్యక్తుల ఇచ్చిన దైర్యం తో ఇష్టారాజ్యం గా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తుంది… దీనికి తోడు కొందరు లేబర్ అధికారులు సహకరించడం ఇతగాడి ధైర్యానికి కారణమని తెలుస్తుంది.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నడుస్తున్న పులిస్టాప్ పెట్టకుండా అధికారులు సహకరించడం వల్లె ఆ యజమాని బాలకార్మికుల చేత పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… అంతేకాదు లేబర్ అధికారులు సైతం చర్యలకు వెనుకాడడం వల్ల అది నిజమే అని అనుమానాలు కలుగుతున్నాయి…
రంగేలా రాష్ట్ర వ్యాప్త దందా..?
ఆధార్ కార్డులతో మోసం.. వయస్సు కు ఫోటోతో సంబంధమే లేదు…!!
కోట్ల రూపాయల వ్యాపారం.. పని వాళ్ళ దగ్గర కక్కుర్తి…?
న్యూస్10 విశ్వసనీయ కథనం…
మరో సంచికలో….



