హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబి దాడులు కొనసాగుతున్నాయి… రిజిస్ట్రేషన్ కార్యాలయం లోకి ప్రవేశించిన ఏసీబి అధికారులు కార్యాలయం లోపలినుంచి గడియ పెట్టేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు…రిజిస్ట్రేషన్ కార్యాలయం లో సోదాలు కొనసాగుతుండ డంతో అధికారుల్లో గుబులు పట్టుకుంది…కాగా హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని పైల్స్ గదిలో తనిఖీలు చేస్తున్న ఏసీబి అధికారులు ఒక్కో పైల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం… ఓ పక్క కార్యాలయంలో ఏసీబి తనిఖీలు జరుగుతుండగా మరోపక్క ప్రజలకు ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ పనులు యధావిధిగానే కొనసాగుతున్నాయి…



