కాంగ్రెస్ సర్కార్ పై విజయశాంతి మండిపాటు

కాంగ్రెస్ సర్కార్ పై పైర్ బ్రాండ్ ఎమ్మెల్సి విజయశాంతి మండిపడ్డారు.. శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సి విజయశాంతి ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి…? అని ప్రశ్నించారు…

శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి

ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం

అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు

మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు

జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు

ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి

మండలి లో మాట్లాడుతున్న ఎమ్మెల్సి విజయశాంతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here